పవన్‌కు వైఎస్ఆర్‌సీ సానుభూతి ఎందుకో...
సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కు ఊహించని పక్షం నుంచి సానుభూతి లభించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా పవన్‌పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ పట్ల సానుభూతి ప్రదర్శించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్పందించిన తీరు బాగోలేదని అన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబుకు అలా వాడుకుని వదిలేసే నైజం ఉందని అంబటి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ […]
Advertisement
సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కు ఊహించని పక్షం నుంచి సానుభూతి లభించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా పవన్‌పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ పట్ల సానుభూతి ప్రదర్శించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్పందించిన తీరు బాగోలేదని అన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబుకు అలా వాడుకుని వదిలేసే నైజం ఉందని అంబటి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఏమన్నా ప్రతిపక్ష నాయకుడా? ఆయన తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి ఆప్తుడే కదా? ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లూ గడ్డం పట్టుకుని పార్టీకి ప్రచారం చేయమని అడిగిన సంగతి తెలుగుదేశం ఎంపీలు, నాయకులు మర్చిపోయారా? ఒకే వేదికపై నుంచి పవన్‌తో ప్రచారం చేయించుకున్న సంగతి మర్చిపోయారా? చంద్రబాబు ఇచ్చిన హామీలన్నిటికీ తానే పూచీ అని పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని మర్చిపోయారా? ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ఒక మాట అన్నాడని తెలుగుదేశం నాయకులు, ఎంపీలు రెచ్చిపోవడం ఎందుకు? అని అంబటి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఆరోజు ఎందుకు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకున్నారు… ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎందుకు పవన్ కల్యాణ్ జుట్టు పట్టుకుంటున్నారు? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. మీరు పవన్ విషయంలో సానుభూతి ప్రకటిస్తున్నారా అని విలేకరులు అడగ్గా లేదు లేదు… తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి నైజాన్ని బైటపెట్టడానికి ఈ ఉదంతాన్ని ఉదహరిస్తున్నా అని అంబటి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పవన్‌కల్యాణ్‌తో కలసి వైఎస్ఆర్‌సీపీ పోరాడుతుందా అన్న ప్రశ్నకు ఒక్క పవన్ ఏమిటి..? ఎవరితోనైనా కలసి పోరాడతామని అంబటి బదులిచ్చారు.
Advertisement