అమరావతిలో తెలుగుదేశం కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కొత్త రాజధాని ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలని, అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు సాగించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని సమాచారం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే తాత్కాలికంగా విజయవాడలోగానీ, గుంటూరులోగానీ ఒక భవనాన్ని తీసుకుని అక్కడ తాత్కాలిక కార్యాలయాన్నిప్రారంభించాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా బాధ్యతలు చూస్తున్న చంద్రబాబు తనయుడు నారా […]
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కొత్త రాజధాని ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలని, అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు సాగించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని సమాచారం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే తాత్కాలికంగా విజయవాడలోగానీ, గుంటూరులోగానీ ఒక భవనాన్ని తీసుకుని అక్కడ తాత్కాలిక కార్యాలయాన్నిప్రారంభించాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా బాధ్యతలు చూస్తున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నెలలో సగం రోజులు అక్కడే ఉండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని పార్టీవర్గాలంటున్నాయి. అమరావతిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలని అధినేత నిర్ణయం తీసుకున్నారని, అయితే అందుకు సమయం పడుతుంది కనుక ఈలోగా తాత్కాలిక కార్యాలయం నుంచే కార్యకలాపాలు సాగుతాయని లోకేష్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. నెలలో సగం రోజులు అక్కడే ఉంటానని కూడా లోకేష్ చెప్పారట. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశాలుడడం వల్ల లోకేష్ ఏపీని తన కార్యక్షేత్రంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు వినిపిస్తోంది. అక్కడైతే తమ ప్రభుత్వం, తమ అధికారులు, తమ ఏసీబీ ఉంటుంది కాబట్టి అన్ని పనులు చక్కబెట్టుకోవడానికి వెసులు బాటుగా ఉంటుందని చినబాబు భావిస్తున్నట్లు కొద్దికాలం కిందట మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
Advertisement