9,10 తరగతుల్లో ధీరూభాయి అంబానీ చరిత్ర
రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ చరిత్రను 9,10 తరగతుల పాఠ్యాంశంగా చేర్చాలని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన ధీరూభాయి గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు యువతకు స్పూర్తిదాయకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూసేంద్రసింహ్ చుదస్మా రాష్ట్ర పాఠ్యపుస్తకాల బోర్డుకు ధీరూభాయి అంబానీ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అంబానీ లాంటి ప్రముఖుల జీవన పోరాటాల గురించి ఈతరం విద్యార్ధులకు బోధించాల్సిన అవసరముందని బోర్డు కూడా భావించడంతో ధీరూభాయి అంబానీ […]
రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ చరిత్రను 9,10 తరగతుల పాఠ్యాంశంగా చేర్చాలని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన ధీరూభాయి గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు యువతకు స్పూర్తిదాయకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూసేంద్రసింహ్ చుదస్మా రాష్ట్ర పాఠ్యపుస్తకాల బోర్డుకు ధీరూభాయి అంబానీ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అంబానీ లాంటి ప్రముఖుల జీవన పోరాటాల గురించి ఈతరం విద్యార్ధులకు బోధించాల్సిన అవసరముందని బోర్డు కూడా భావించడంతో ధీరూభాయి అంబానీ జీవిత చరిత్ర పాఠ్యాంశంగా రానుంది. ఇకపై 9,10 తరగతుల విద్యార్థులకు అంబానీ జీవిత చరిత్రను బోధిస్తారు.