పోలీసు పరీక్షలకూ ప్రిలిమ్స్, మెయిన్స్
ఇకపై పోలీస్ ఉద్యోగాలకు కూడా సివిల్స్, గ్రూప్స్ పరీక్షల తరహాలో జరపాలని ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. పోలీసుల ఎంపిక విధానంలో ఇప్పటి వరకూ స్ర్కీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కి.మీ. పరుగు పందాన్ని తొలగించి దాని స్థానంలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పోలీసు రిక్రూట్ మెంట్ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని కూడా బోర్డు నిర్ణయించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో పలు కీలక సంస్కరణలతో కూడిన ఫైలు […]
ఇకపై పోలీస్ ఉద్యోగాలకు కూడా సివిల్స్, గ్రూప్స్ పరీక్షల తరహాలో జరపాలని ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. పోలీసుల ఎంపిక విధానంలో ఇప్పటి వరకూ స్ర్కీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కి.మీ. పరుగు పందాన్ని తొలగించి దాని స్థానంలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పోలీసు రిక్రూట్ మెంట్ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని కూడా బోర్డు నిర్ణయించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో పలు కీలక సంస్కరణలతో కూడిన ఫైలు హోం శాఖ నుంచి సాధారణ పరిపాలనా విభాగానికి చేరింది. వీటిపై ప్రభుత్వానికి ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ మంగళవారం సచివాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. ఈ కీలక సంస్కరణలకు కనుక ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఇకపై జరిగే అన్ని రిక్రూట్‌మెంట్స్‌ను ఇదే తరహాలో చేపట్టనున్నారు.
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక సంస్కరణలు
ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్ పరీక్షగా నిర్వహించిన తర్వాత దేహదారుఢ్య పరీక్షలతో పాటు ఈవెంట్స్ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తప్పనిసరి
ఇప్పటి వరకూ నిర్వహించిన వంద మీటర్లు, 800 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్ జంప్‌లో కొన్నింటిని తొలగించి, మరికొన్నింటి పరిధిని తగ్గించనున్నారు.
పోలీస్ కమ్యూనికేషన్స్, రవాణా, వేలిముద్రల విభాగాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణ, ఆర్డ్మ్ రిజర్వ్ విభాగాల ఎంపిక ప్రక్రియను పూర్తి భిన్నంగా డిజైన్ చేస్తున్నారు. అభ్యర్థుల సాంకేతిక అర్హతలు, సమకాలీన అంశాలపై పట్టును బేరీజు వేసేలా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
డ్రైవర్ ఎంపికకు వయోపరిమితి 21 నుంచి 25కు మార్చుతున్నారు.