సూపర్ న్యూమరరీ పోస్టులను ఆమోదించిన తెలుగు రాష్రాలు
సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే వీటిని కూడా ఏర్పాటు చేసేందుకు తెలుగు రాష్ట్రాల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుందిరింది. వచ్చే మార్చి వరకూ ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగా సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటు చేయాలని రాష్ట్ర పునర్విభజన విభాగం పంపిన ప్రతిపాదనలను ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీలో ఒక రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులెవరైనా అభ్యంతరం వ్యక్తం చేసిన […]
సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే వీటిని కూడా ఏర్పాటు చేసేందుకు తెలుగు రాష్ట్రాల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుందిరింది. వచ్చే మార్చి వరకూ ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగా సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటు చేయాలని రాష్ట్ర పునర్విభజన విభాగం పంపిన ప్రతిపాదనలను ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీలో ఒక రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులెవరైనా అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో అటువంటి ఉద్యోగులను రిలీవ్ చేయకూడదనే నిబంధన ఉంది. అలాగే అభ్యంతరం వ్యక్తం చేయని ఉద్యోగులను నిలువరించకూడదనే నిబంధన కూడా ఉంది. ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేసి, మరో రాష్ట్రానికి చెందిన ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయనప్పుడు సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిబంధన ప్రకారం రెండు రాష్ట్రాలూ తాత్కాలికంగా సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి.