హామీల అమలు చాలా కష్టం: చంద్రబాబు
తాను చాలా హామీలిచ్చానని, అవన్నీ సమైక్య రాష్ట్రంలో ఇచ్చినవని, కాని ఆనాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎంతో మార్పు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ విభజన తర్వాత పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చిందని, హామీలన్నీ నెరవేరాలంటే చాలా కష్టమని, అయినా తనపై నమ్మకముంచి బాధ్యతను అప్పగించారని, వీటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే తన ధ్యేయమని, కాకినాడ పోర్టును ఆదునీకరిస్తామని చంద్రబాబు తెలిపారు. […]
Advertisement
తాను చాలా హామీలిచ్చానని, అవన్నీ సమైక్య రాష్ట్రంలో ఇచ్చినవని, కాని ఆనాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎంతో మార్పు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ విభజన తర్వాత పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చిందని, హామీలన్నీ నెరవేరాలంటే చాలా కష్టమని, అయినా తనపై నమ్మకముంచి బాధ్యతను అప్పగించారని, వీటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే తన ధ్యేయమని, కాకినాడ పోర్టును ఆదునీకరిస్తామని చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించడమే తన లక్ష్యమని, పేదల కష్టాల కాడిని తన భుజాలపై మోసి వారికి అండగా ఉంటానని ఆయన అన్నారు.
బుల్లెట్‌లా దూసుకెళ్తా
తాను బుల్లెట్‌లా దూసుకెళ్తానని, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. సోనియా గాంధీ చేసిన పనికి రాష్ట్రంలో ఆ పార్టీ అడ్రసు లేకుండా పోయిందని ఆయన అన్నారు. కేసీఆర్ నీతిమాలిన పనులకు పాల్పడుతున్నారని, టీఆర్ఎస్ అనైతిక రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కేబినెట్‌లో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని, టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్‌పై కేసు పెట్టాలని ఆయన డిమాండు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం తమకు అభ్యంతరం లేదని, అయితే వారిని పదవులకు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసిన తర్వాత కేబినెట్‌లో చేర్చుకునే చేవ టీఆర్ఎస్, కేసీఆర్‌కు లేవా అని ప్రశ్నించారు.
Advertisement