కాశ్మీర్‌లో పాక్ జెండాలు యూపీయే పుణ్యమే: బీజేపీ
జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ జెండాలు ఎగురుతున్నాయంటే దానికి ప్రధాన కారణం గత యూపీయే ప్రభుత్వ విధానాలేనని బీజేపీ నేత జహంగీర్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం సరిగా పాలించకపోవడం, జమ్మూకాశ్మీర్ పై ప్రత్యేక దృష్టిని పెట్టకపోవడం వల్ల అక్కడి వేర్పాటు వాదులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలను అంత తేలికగా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఎవరు పాకిస్థాన్ జెండాలు ఎగురు వేస్తున్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల […]
Advertisement
జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ జెండాలు ఎగురుతున్నాయంటే దానికి ప్రధాన కారణం గత యూపీయే ప్రభుత్వ విధానాలేనని బీజేపీ నేత జహంగీర్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం సరిగా పాలించకపోవడం, జమ్మూకాశ్మీర్ పై ప్రత్యేక దృష్టిని పెట్టకపోవడం వల్ల అక్కడి వేర్పాటు వాదులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలను అంత తేలికగా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఎవరు పాకిస్థాన్ జెండాలు ఎగురు వేస్తున్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ లో ప్రత్యేక వాదులు ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో పాకిస్థాన్ జెండాలను కొందరు ఎగురవేస్తున్న విషయం తెలిసిందే.
Advertisement