ఇక నాలుగేళ్ళపాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం వేలాది మంది విద్యార్థులకు ఊరట కలిగించనుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, బి.టెక్‌, పాలిటెక్నిక్‌ తదితర కోర్సులలో చేరే ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ వర్గాల విద్యార్ధులు ఇక ఒక్క‌సారి ఆదాయ ధ్ర‌వీక‌ర‌ణ ప‌త్రం తీసుకుంటే నాలుగేళ్ళ‌పాటు అది ప‌ని చేస్తుంది.   రెవెన్యూశాఖ ఇందుకు సంబంధించి జీవో నంబరు 186ను విడుదల చేసింది. ఈ జోవో ప్రకారం ఇకమీదట ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ […]

Advertisement
Update:2015-06-01 18:50 IST
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం వేలాది మంది విద్యార్థులకు ఊరట కలిగించనుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, బి.టెక్‌, పాలిటెక్నిక్‌ తదితర కోర్సులలో చేరే ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ వర్గాల విద్యార్ధులు ఇక ఒక్క‌సారి ఆదాయ ధ్ర‌వీక‌ర‌ణ ప‌త్రం తీసుకుంటే నాలుగేళ్ళ‌పాటు అది ప‌ని చేస్తుంది. రెవెన్యూశాఖ ఇందుకు సంబంధించి జీవో నంబరు 186ను విడుదల చేసింది. ఈ జోవో ప్రకారం ఇకమీదట ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తేదీ నుంచి నాలుగేళ్ళపాటు చెల్లుతుంది. విద్యార్థులు ఈ పత్రం నకళ్ళను ఆయా విద్యా సంస్థలలో వారికి అందచేయవచ్చు. అడిగినప్పుడు అసలు పత్రాన్ని చూపిస్తే సరిపోతుంది. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్లు, ఇతర ప్రభుత్వ రాయితీలను ఈ పత్రాన్ని అందచేయడం ద్వారా పొందేందుకు వీలుంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్ధులు మీసేవా కేంద్రాలకు వెళ్ళి రూ.35 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారుల పరిశీలన అనంతరం వారం రోజులలోపు ఈ కేంద్రాల ద్వారా తిరిగి ఈ పత్రాలను పొందవచ్చు.
Tags:    
Advertisement

Similar News