క్యాన్సర్‌ను నిరోధించే యాపిల్

రోజుకొక యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని అంటుంటారు. అది ముమ్మాటికీ నిజమే. యాపిల్ తొక్కలో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనాలు క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. ట్రిటర్‌పెనాయిడ్స్‌గా వ్యవహరించే ఈ పదార్ధాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరంలో నుంచి బయటకు పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కలోనే కాదు పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్స్, […]

Advertisement
Update:2015-05-29 02:29 IST
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని అంటుంటారు. అది ముమ్మాటికీ నిజమే. యాపిల్ తొక్కలో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనాలు క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. ట్రిటర్‌పెనాయిడ్స్‌గా వ్యవహరించే ఈ పదార్ధాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరంలో నుంచి బయటకు పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కలోనే కాదు పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ ఉన్నాయి. యాపిల్‌పండు శరీరంలో సహజ యాంటీఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది. యాపిల్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ వల్ల శరీరాన్ని పరిపుష్టం చేస్తాయి. మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ వంటి రసాయనాలు కాలేయం, జీర్ణక్రియలో తలెత్తే సమస్యలను నివారిస్తాయి. ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. చర్మ సంబంధమైన వ్యాధులు కూడా తగ్గుతాయి.
Tags:    
Advertisement

Similar News