దీర్ఘవ్యాధులకు చెక్ చెప్పే స్వీట్‌కార్న్

 మొక్కజొన్న (స్వీట్‌కార్న్) గింజలు చాలా బలవర్థకమైన ఆహారంగా చెప్పుకోవాలి. అంతేకాదు ఇది చాలా చౌకగా లభించే ఆహారం కూడా. మొక్కజొన్నలోని లవణాలు, విటమిన్లు ఇన్సులిన్ మీద ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం. మొక్కజొన్నతో ఇంకా అనేక ఉపయోగాలున్నాయి.  – మొక్కజొన్నలోని లుటెయిన్, జీక్జాన్‌డిన్ అనే అమినో యాసిడ్లు మంచి యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చాలా ఉపకరిస్తాయి.  – మొక్కజొన్నలో లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, […]

Advertisement
Update:2015-05-10 02:15 IST
మొక్కజొన్న (స్వీట్‌కార్న్) గింజలు చాలా బలవర్థకమైన ఆహారంగా చెప్పుకోవాలి. అంతేకాదు ఇది చాలా చౌకగా లభించే ఆహారం కూడా. మొక్కజొన్నలోని లవణాలు, విటమిన్లు ఇన్సులిన్ మీద ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం. మొక్కజొన్నతో ఇంకా అనేక ఉపయోగాలున్నాయి.
– మొక్కజొన్నలోని లుటెయిన్, జీక్జాన్‌డిన్ అనే అమినో యాసిడ్లు మంచి యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చాలా ఉపకరిస్తాయి.
– మొక్కజొన్నలో లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్‌లున్నాయి. ఇవి చర్మ సంరక్షణకు, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
– ఇందులోని ఫెనోలిక్ ఫ్లవనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్‌కి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రభావాన్ని తగ్గించే గుణం ఉంది.
– మొక్కజొన్నలోని బీ12, ఫోలిక్ యాసిడ్ రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
– చిన్న ప్రేవుల పనితీరును క్రమబద్దీకరిస్తుంది.
– కొలెస్ట్రాల్ నివారణకు స్వీట్‌కార్న్ చక్కగా ఉపయోగపడుతుంది. దానివల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
– మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
– స్వీట్‌కార్న్‌లో థయామిన్, నియాసిన్, ఫొలేట్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలతో పాటు జింక్, మెగ్నీషియం, రాగి, ఇనుము, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి.
Tags:    
Advertisement

Similar News