లాబీయింగ్‌ చేసేవారికే అవార్డులు: రాందేవ్ 

‘పద్మ’ పురస్కారాలే కాదు నోబెల్‌ అవార్డు అయినా సరే లాబీయింగ్‌ చేసే వారిని, రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చే వారినే వరిస్తాయని యోగా గురు బాబా రాందేవ్‌ అన్నారు. తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. యోగా విస్తరణ దిశగా, అసోచాం ఏర్పాటు చేసిన కార్యక్రమానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్‌ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పది కోట్ల కుటుంబాలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యం […]

Advertisement
Update:2015-05-09 22:13 IST
‘పద్మ’ పురస్కారాలే కాదు నోబెల్‌ అవార్డు అయినా సరే లాబీయింగ్‌ చేసే వారిని, రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చే వారినే వరిస్తాయని యోగా గురు బాబా రాందేవ్‌ అన్నారు. తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. యోగా విస్తరణ దిశగా, అసోచాం ఏర్పాటు చేసిన కార్యక్రమానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్‌ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పది కోట్ల కుటుంబాలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యం విక్ర‌యించి డబ్బులు తీసుకునే వారికన్నా యోగా నేర్పేందుకు రుసుము తీసుకునే వారే మేలని అన్నారు. ఇందులో ఒక‌టి ఆరోగ్యాన్ని నాశ‌నం చేస్తే మ‌రొక‌టి ఆయువును పెంచుతుంద‌ని ఆయ‌న అన్నారు. యోగాను పొరపాటున ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమోట్‌ చేసి ఉంటే.. అది కూడా వివాదాస్పదం చేసేవార‌ని రాందేవ్‌ విపక్షాలపై ప‌రోక్షంగా విమ‌ర్శానాస్త్రం సంధించారు.
Tags:    
Advertisement

Similar News