ఆర్టీసీ సమ్మెకు జగన్ సంపూర్ణ మద్దతు
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహనరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమైందని, వారి డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని ఆయన అన్నారు. ఈ మేరకు జగన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాశారు. ఇందులో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో స్వయంగా చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలో గతంలో తెలుగుదేశం, టీఆర్ఎస్ ప్రభుత్వాలు […]
Advertisement
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహనరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమైందని, వారి డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని ఆయన అన్నారు. ఈ మేరకు జగన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాశారు. ఇందులో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో స్వయంగా చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలో గతంలో తెలుగుదేశం, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తే… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వాలు కారణం తప్ప ఆర్టీసీ ఉద్యోగులు కాదని, యాజమాన్య పోకడల వల్లే రవాణా సంస్థకు నష్టాలొచ్చాయని ఆయన అన్నారు. డీజిల్ మీద వ్యాట్ రూపంలో ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి యేటా రూ. 541 కోట్లు చెల్లిస్తుందని, విడి భాగాల మీద చెల్లించేది మరో రూ. 150 కోట్లు ఉందని, ఏపీ ప్రభుత్వం వ్యాట్‌ను రద్దు చేస్తే ఆర్టీసీ దర్జాగా బతుకుతుందని… ఈ విషయాలన్నీ తెలిసినా చంద్రబాబు ఎందుకు ఈ విధానాన్ని అనుసరించడం లేదని జగన్ ప్రశ్నించారు. అసలు ఆర్టీసీ నష్టాల బాట పట్టడానికి మీరు కారణం కాదా అని జగన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా కార్మికుల న్యాయబద్దమైన కోర్కెలను తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండు చేశారు. ఆర్టీసీ సమ్మె వల్ల సాధారణ ప్రజానీకం అనేక కష్టాలు పడుతుందని, ఈ విషయం ప్రభుత్వాలకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని జగన్ అన్నారు. సమ్మె విషయంలో ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు అసలు బాగాలేదని జగన్ విమర్శించారు. శాంతి యుతంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
Advertisement