రాహుల్‌తో శంషాబాద్ నుంచి నిర్మల్ వరకు ర్యాలీ... కాంగ్రెస్ నిర్ణయం
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను తెలంగాణలో విజయవంతం చేసే వ్యూహం రూపకల్పనలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దానం నాగేందర్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఈనెల 11న వస్తున్న రాహుల్ గాంధీకి అపూర్వ స్వాగతం ఏర్పాటు చేయాలని నేతలంతా నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటనకు అద్భుతమైన ఏర్పాట్లు చేయాలని, విమానంలో దిగినప్పటి నుంచి ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళే వరకు కాంగ్రెస్ సీనియర్ […]
Advertisement
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను తెలంగాణలో విజయవంతం చేసే వ్యూహం రూపకల్పనలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దానం నాగేందర్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఈనెల 11న వస్తున్న రాహుల్ గాంధీకి అపూర్వ స్వాగతం ఏర్పాటు చేయాలని నేతలంతా నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటనకు అద్భుతమైన ఏర్పాట్లు చేయాలని, విమానంలో దిగినప్పటి నుంచి ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళే వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఒక్కటిగా ఉంటూ పర్యటనను విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఆయన విమానం నుంచి దిగిన తర్వాత శంషాబాద్ నుంచి మెహిదీపట్నం, పంజాగుట్ట, బేగంపేట, బోయిన్‌పల్లి మీదుగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ వరకు భారీ ర్యాలీ కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్ యాదవ్, భట్టి విక్రమార్కలతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, రైతుల ఆత్మహత్యలపై కూడా చర్చించారు. తెలంగాణలో ఇప్పటివరకు 900 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న నాయకులు రైతుల సమస్యలు తీర్చేది… తీర్చగలిగేదీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. తెలంగాణ తెచ్చామంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని, రాహుల్‌గాంధీ పాల్గొనే వేదిక నుంచి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదానిపై కూడా చర్చ జరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల్ని, పార్టీ భవిష్యత్ మనుగడకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపై కూడా చర్చించారు.
Advertisement