గాంధీలో ధర్నాకు దిగిన వైద్యులు
ఆస్పత్రుల్లో లిఫ్ట్‌లు పని చేయవు…ఆపరేషన్ ధియేటర్లలో వసతులు లేవు… విధులు ఎలా నిర్వహించగలం… అంటూ గాంధీ ఆస్పత్రి వైద్యులు ధర్నాకు దిగారు. సరైన సౌకర్యాలు కల్పించే వరకు వైద్యం చేసేది లేదని భీష్మించారు. సూపరింటెండెంట్ ఛాంబర్‌లో బైఠాయించారు. దీంతో శుక్రవారం జరగాల్సిన 30 ఆపరేషన్లు ఆగిపోయాయి. ఈవిషయమై వైద్యులు మాట్లాడుతూ ఎన్నో నెలలుగా లిఫ్ట్‌లు పని చేయడం లేదని, ఆపరేషన్ ధియేటర్లలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు ఉండడం లేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విధిలేని పరిస్థితుల్లోనే […]
Advertisement
ఆస్పత్రుల్లో లిఫ్ట్‌లు పని చేయవు…ఆపరేషన్ ధియేటర్లలో వసతులు లేవు… విధులు ఎలా నిర్వహించగలం… అంటూ గాంధీ ఆస్పత్రి వైద్యులు ధర్నాకు దిగారు. సరైన సౌకర్యాలు కల్పించే వరకు వైద్యం చేసేది లేదని భీష్మించారు. సూపరింటెండెంట్ ఛాంబర్‌లో బైఠాయించారు. దీంతో శుక్రవారం జరగాల్సిన 30 ఆపరేషన్లు ఆగిపోయాయి. ఈవిషయమై వైద్యులు మాట్లాడుతూ ఎన్నో నెలలుగా లిఫ్ట్‌లు పని చేయడం లేదని, ఆపరేషన్ ధియేటర్లలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు ఉండడం లేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విధిలేని పరిస్థితుల్లోనే తాము విధులు బహిష్కరించి ధర్నాకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. వైద్యుల వాదనను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్ళగా తాను లిఫ్ట్‌లు రిపేరు చేయమని ప్రతిపాదనలు పంపానని, ఇంకా జరగలేదని తెలిపారు. కొత్త లిఫ్ట్‌లు కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు.
Advertisement