ట్రైనర్ వేధింపులు భరించలేక అథ్లెట్ల ఆత్మహత్యాయత్నం
కేరళ స్పోర్ట్స్ మీట్‌లో విషాదం చోటు చేసుకుంది. క్రీడా అంశాల్లో శిక్షణ పొందుతున్న నలుగురు అథ్లెట్లు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో అపర్ణ అనే అథ్లెట్ మృతి చెందింది. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెబుతున్నారు. అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్న కోచ్ వేధింపులే వీరు విషం తాగి ఆత్మహత్య చేసుకోవటానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీనియర్ల ర్యాంగింగ్ కూడా అథ్లెట్ల ఆత్మహత్యా యత్నానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ట్రైనర్ వేధింపుల వల్లే […]
Advertisement
కేరళ స్పోర్ట్స్ మీట్‌లో విషాదం చోటు చేసుకుంది. క్రీడా అంశాల్లో శిక్షణ పొందుతున్న నలుగురు అథ్లెట్లు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో అపర్ణ అనే అథ్లెట్ మృతి చెందింది. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెబుతున్నారు. అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్న కోచ్ వేధింపులే వీరు విషం తాగి ఆత్మహత్య చేసుకోవటానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీనియర్ల ర్యాంగింగ్ కూడా అథ్లెట్ల ఆత్మహత్యా యత్నానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ట్రైనర్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని అపర్ణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, దీనిపై విచారణకు ఆదేశిస్తున్నామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ పరిస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని పేర్కొంది.
Advertisement