తెలంగాణలో యువరాజు పర్యటన 11 నుంచి
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 11న హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి కొంత ఆర్థికసాయం కూడా చేస్తారని సమాచారం. తెలంగాణలో ఆయన పర్యటన తొలుత ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌తో మొదలవనుంది. నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు15 కి.మీ.లపాటు పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో యువరాజు రాహుల్ గాంధీ పర్యటన నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని కాంగ్రెస్ అధినాయకత్వం బోలెడు ఆశలు పెట్టుకుంది. […]
Advertisement
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 11న హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి కొంత ఆర్థికసాయం కూడా చేస్తారని సమాచారం. తెలంగాణలో ఆయన పర్యటన తొలుత ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌తో మొదలవనుంది. నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు15 కి.మీ.లపాటు పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో యువరాజు రాహుల్ గాంధీ పర్యటన నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని కాంగ్రెస్ అధినాయకత్వం బోలెడు ఆశలు పెట్టుకుంది. మొత్తానికి సెలవుల తరువాత యువరాజులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రలతోపాటు, రైతుల పరామర్శయాత్రలు చేపట్టి పార్టీలో కొత్త ఉత్తేజాన్ని నింపాలన్న తాపత్రయం కనిపిస్తోంది. రేపో మాపో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పట్టాభిషేకం లాంఛనమేనన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ స్పీడు పెంచాడని పలువురు విశ్లేషిస్తున్నారు.
Advertisement