జూన్‌లో డ్వాక్రా రుణాల మాఫీ: కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్ : జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. అదే రోజున నవనిర్మాణ దీక్ష పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపునిచ్చారు. దాదాపు 10 గంటల పాటు సాగిన సుధీర్ఘ సమావేశంలో మంత్రివర్గం అనేక కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. స్విస్ చాలెంజ్ పద్దతిలో సీడ్ కేపిటల్ మాస్టర్ డెవలపర్ ఎంపిక చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. దీంతోపాటుగా డ్వాక్రా రుణాల మాఫీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలు […]
Advertisement
హైదరాబాద్ : జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. అదే రోజున నవనిర్మాణ దీక్ష పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపునిచ్చారు. దాదాపు 10 గంటల పాటు సాగిన సుధీర్ఘ సమావేశంలో మంత్రివర్గం అనేక కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. స్విస్ చాలెంజ్ పద్దతిలో సీడ్ కేపిటల్ మాస్టర్ డెవలపర్ ఎంపిక చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. దీంతోపాటుగా డ్వాక్రా రుణాల మాఫీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలు మొత్తం వడ్డీతో కలిపి రూ. 4,086 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జూన్ 3 నుంచి 8 వరకు డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటితో పాటుగా విద్యుత్, నీరు-చెట్టు, ఇసుక, నిత్యావసర వస్తువుల ధరలపై చర్చించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసమీకరణపైనా కేబినెట్ భేటీలో చర్చించారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులోనే శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సాధ్యమైనంత ఎక్కువగా భూములు సమీకరించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు.
Advertisement