శివాజీ ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు భారీగా సంఘీభావం

గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోరుతూ గుంటూరులో సినీ హీరో శివాజీ చేస్తున్న ఆమ‌ర‌ణ దీక్ష‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఆయ‌న‌కు రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జాసంఘాలు, న్యాయ‌వాదుల సంఘాలు అండ‌గా నిలుస్తున్నాయి. ఆయ‌న దీక్ష చేస్తున్న శిబిరం వ‌ద్ద మాల మ‌హానాడు కార్య‌క‌ర్త‌ల‌తోపాటు జ‌న‌సేన‌, లోక్‌స‌త్తా, ఆమ్ఆద్మీ, ఆర్‌పీఐ., ఇండియ‌న్ ద‌ళిత క్రిష్టియ‌న్ ఉద్యోగుల సంఘం ప్ర‌తినిధులు అండ‌గా నిలిచారు. శివాజీకి విశాలాంధ్ర మ‌హాస‌భ కూడా సంఘీభావం ప్ర‌క‌టించింది. టీవీలో విష‌యం తెలుసుకున్న మాజీ కేంద్ర […]

Advertisement
Update:2015-05-04 07:15 IST
గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోరుతూ గుంటూరులో సినీ హీరో శివాజీ చేస్తున్న ఆమ‌ర‌ణ దీక్ష‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఆయ‌న‌కు రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జాసంఘాలు, న్యాయ‌వాదుల సంఘాలు అండ‌గా నిలుస్తున్నాయి. ఆయ‌న దీక్ష చేస్తున్న శిబిరం వ‌ద్ద మాల మ‌హానాడు కార్య‌క‌ర్త‌ల‌తోపాటు జ‌న‌సేన‌, లోక్‌స‌త్తా, ఆమ్ఆద్మీ, ఆర్‌పీఐ., ఇండియ‌న్ ద‌ళిత క్రిష్టియ‌న్ ఉద్యోగుల సంఘం ప్ర‌తినిధులు అండ‌గా నిలిచారు. శివాజీకి విశాలాంధ్ర మ‌హాస‌భ కూడా సంఘీభావం ప్ర‌క‌టించింది. టీవీలో విష‌యం తెలుసుకున్న మాజీ కేంద్ర మంత్రి హ‌ర్ష‌కుమార్ విజ‌య‌వాడ‌లోని ఆయ‌న దీక్షా శిబిరం వ‌ద్ద‌కు వ‌చ్చి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాను రాష్ట్ర విభ‌జ‌న‌ను ఆనాడే వ్య‌తిరేకించాన‌ని, రాష్ట్ర విడిపోయిన త‌ర్వాత ఏపీకి ఆర్థికంగా అండ‌గా నిల‌వాల్సిన కేంద్రం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డం అన్యాయ‌మ‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ ఐదేళ్ళ‌పాటు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి ఆరోజు పార్ల‌మెంటులో ప్ర‌స్తావిస్తే భార‌తీయ జ‌న‌తాపార్టీ ప‌దేళ్ళ‌పాటు ఉండాల‌ని డిమాండు చేసింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఇపుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి ఎందుకు కుంటిసాకులు చెబుతుంద‌ని ప్ర‌శ్నించారు. 13 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చిన కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని, ఈ రాష్ట్రం చేసిన పాపం ఏమిట‌ని జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా ఇస్తే భావిత‌రాలు బాగుప‌డ‌తాయ‌ని లోక్‌స‌త్తా పేర్కొంది. శివాజీ సినిమాల‌కే పరిమితం కాకుండా ప్ర‌జాహితం కోరి ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం కొన‌సాగించడం శుభ ప‌రిణామ‌మ‌ని, ఆయ‌న‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటామ‌ని గుంటూరు బార్ అసోసియేష‌న్‌, రాష్ట్ర బార్ అసోసియేష‌న్ ఎగ్జిక్యూటీవ్ మెంబ‌ర్ తెలిపారు. శివాజీకి మ‌ద్ద‌తుగా విశాఖ‌పట్నంలో కూడా ర్యాలీ నిర్వ‌హించి రోడ్ల‌పై బైఠాయించారు. కాగా శివాజీ ఆరోగ్య ప‌రిస్థితిపై పోలీసులు ఆరా తీశారు. ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించారు. బీపీ., షుగ‌ర్ స్థాయిలు మామూలుగానే ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News