ఘ‌నంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం

62వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీ అవార్డుగ్రహీతలను అభినందించారు. భార‌త సినీప‌రిశ్ర‌మ అంత‌ర్జాతీయ స్థాయికి వెళ్లాల‌ని ఆకాంక్షించారు. ఉత్తమ నటుడు కేటగిరీలో కన్నడ నటుడు విజయ్ కుమార్ బి అవార్డుఅందుకోగా, ఉత్తమ నటి కేటగిరీలో కంగనా రనౌత్ అవార్డును స్వీకరించింది.  దాదా సాహెబ్ అవార్డుతో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ జాతీయ నటుడు, ఉత్తమ జాతీయ నటితదితర […]

Advertisement
Update:2015-05-03 18:45 IST

62వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డుగ్రహీతలను అభినందించారు. భార‌త సినీప‌రిశ్ర‌మ అంత‌ర్జాతీయ స్థాయికి వెళ్లాల‌ని ఆకాంక్షించారు. ఉత్తమ నటుడు కేటగిరీలో కన్నడ నటుడు విజయ్ కుమార్ బి అవార్డుఅందుకోగా, ఉత్తమ నటి కేటగిరీలో కంగనా రనౌత్ అవార్డును స్వీకరించింది. దాదా సాహెబ్ అవార్డుతో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ జాతీయ నటుడు, ఉత్తమ జాతీయ నటితదితర అవార్డులను రాష్ట్రపతి తన చేతుల మీదుగా ప్రదానం చేశారు.

Tags:    
Advertisement

Similar News