గోదావరి పుష్కర ఘాట్‌లలో శ్రీవారి నమూనా ఆలయాలు
తిరుమల: త‌్వరలో రానున్న గోదావరి పుష్కరాల్లో శ్రీవారి ఆలయ నమూనాలను ఏర్పాటు చేయాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలని తిరుమల-తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి నిర్ణయించిది. తొలిసారి అన్నమయ్య భవన్‌లో సమావేశమైన పాలక మండలి శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, తిరుచానూరు ఆలయాలకు 450 పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించింది. తలనీలాల సంరక్షణకు ప్రస్తుతమున్న గోదాములు సరిపడడం లేదని భావిస్తూ కొత్తగా అలిపిరిలో మరో గోదామును ఏర్పాటు చేయాలని కూడా పాలక మండలి నిర్ణయించింది. శ్రీవారి […]
Advertisement
తిరుమల: త‌్వరలో రానున్న గోదావరి పుష్కరాల్లో శ్రీవారి ఆలయ నమూనాలను ఏర్పాటు చేయాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలని తిరుమల-తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి నిర్ణయించిది. తొలిసారి అన్నమయ్య భవన్‌లో సమావేశమైన పాలక మండలి శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, తిరుచానూరు ఆలయాలకు 450 పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించింది. తలనీలాల సంరక్షణకు ప్రస్తుతమున్న గోదాములు సరిపడడం లేదని భావిస్తూ కొత్తగా అలిపిరిలో మరో గోదామును ఏర్పాటు చేయాలని కూడా పాలక మండలి నిర్ణయించింది. శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలని, వీఐపీల దర్శనాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్ణయించారు. భక్తుల తలనీలాల్లో ఉపయోగపడేందుకు 1,5 కోట్ల రూపాయలతో 70 లక్షల బ్లేడ్లు కొనాలని నిర్ణయం తీసుకున్నారు. పాలకమండలి సమావేశం అనంతరం… ఈ విషయాలన్నీ టీటీడీ బోర్డు కొత్త ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు.
Advertisement