హైదరాబాద్‌లోనే మహానాడు... పోలిట్‌బ్యూరో నిర్ణయం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడును మే 27 నుంచి హైదరాబాద్‌లోని గండిపేటలో నిర్వహించాలని ఆ పార్టీ పోలిట్‌బ్యూరో నిర్ణయించింది. హైదరాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఇక్కడే నిర్వహించాలని తెలుగుదేశం నిర్ణయించింది. మహానాడు నిర్వహణపై పోలిట్‌బ్యూరోలో శనివారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయవాడలో సభలు పెడితే బాగుంటుందని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అనగా… జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరగనున్నఈ సమయంలో హైదరాబాద్‌లోనే మహానాడు నిర్వహించాలని మిగిలిన నాయకులు అభిప్రాయపడ్డారు. […]
Advertisement
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడును మే 27 నుంచి హైదరాబాద్‌లోని గండిపేటలో నిర్వహించాలని ఆ పార్టీ పోలిట్‌బ్యూరో నిర్ణయించింది. హైదరాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఇక్కడే నిర్వహించాలని తెలుగుదేశం నిర్ణయించింది. మహానాడు నిర్వహణపై పోలిట్‌బ్యూరోలో శనివారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయవాడలో సభలు పెడితే బాగుంటుందని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అనగా… జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరగనున్నఈ సమయంలో హైదరాబాద్‌లోనే మహానాడు నిర్వహించాలని మిగిలిన నాయకులు అభిప్రాయపడ్డారు. భూకంపంతో అతలాకుతలం అయిపోయిన నేపాల్‌కు ఐదు కోట్ల రూపాయల సాయం అందించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అండగా ఉండి ఆదుకోవాలని పిలుపు ఇచ్చింది.
జాతీయపార్టీగా టీడీపీ… అధ్యయనానికి కమిటీ
తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా రూపొందించడానికి విధివిధానాలను అధ్యయనం చేయాల్సిందిగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోరారు. ఇందుకు సంబంధించిన అంశంపై అధ్యయనం చేయడానికి యనమల రామకృష్ణుడు, రావుల చంద్రశేఖరరావు, పయ్యావుల కేశవ్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పోలిట్‌బ్యూరో సభ్యులకు వివరించిన చంద్రబాబు వీటి ప్రచారానికి కార్యకర్తలను బాగా ఉపయోగించుకుని ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాగా పని చేసినందుకు లోకేష్, కళా వెంకటరావు, పెద్దిరెడ్డికి పోలిట్‌బ్యూరో ప్రశంసలు అందజేసింది. ఇంకా సంస్థాగత ఎన్నికలు, కేంద్ర నామినేటెడ్ పదవుల్లో తమ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చే అంశం… తదితరాలపై టీడీపీ నాయకుడు ఎల్. రమణ చర్చకు తెరలేపగా దానిపై కూడా కొంతసేపు చర్చ జరిగింది. ఏపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వవ్యవహార శైలిపై కూడా చర్చించారు. టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకుని విమర్శిచడం వల్లే తాను ప్రతి విమర్శలకు దిగాల్సి వస్తోందని చంద్రబాబు పోలిట్‌బ్యూరోకి వివరణ ఇచ్చారు.
Advertisement