భార్య మరణిస్తుందని.... ఆత్మహత్య

గుంటూరు : త‌న క‌ళ్ళ ముందు భార్య చ‌నిపోవ‌డం చూడ‌లేని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆమె క‌న్నా ముందే తిరిగిరాని లోకాల‌కు వెళ్ళిపోయారు. భార్య‌ క్యాన్సర్‌తో బాధపడి ఎంతో కాలం జీవించలేదని తెలిసి ఆమె మరణం చూడలేక ఆమె కన్నా ముందే చనిపోవాలని నిర్ణయించుకున్న ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి  వేజెండ్లకు చెందిన దెయ్యాల పెదబాలయ్య (67)  రేపల్లె నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న డెల్టా ప్యాసింజర్‌కు ఎదురుగా వచ్చి అందరూ చూస్తుండగానే  ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను విశ్రాంత […]

Advertisement
Update:2015-05-01 19:55 IST
గుంటూరు : త‌న క‌ళ్ళ ముందు భార్య చ‌నిపోవ‌డం చూడ‌లేని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆమె క‌న్నా ముందే తిరిగిరాని లోకాల‌కు వెళ్ళిపోయారు. భార్య‌ క్యాన్సర్‌తో బాధపడి ఎంతో కాలం జీవించలేదని తెలిసి ఆమె మరణం చూడలేక ఆమె కన్నా ముందే చనిపోవాలని నిర్ణయించుకున్న ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి వేజెండ్లకు చెందిన దెయ్యాల పెదబాలయ్య (67) రేపల్లె నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న డెల్టా ప్యాసింజర్‌కు ఎదురుగా వచ్చి అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను విశ్రాంత రైల్వే ఉద్యోగి. ఇతని భార్య శాయమ్మ గత కొన్నాళ్ళుగా క్యాన్సర్‌ వ్యాధితో చికిత్స పొందుతుంది. ఇటీవల కాలంలో వ్యాధి తీవ్రత పెరిగి హైదరాబాద్‌లో చికిత్స పొందుతుంది. మరణం తప్పదని తెలియడంతో కుమార్తె లక్ష్మీ ఇంటికి వచ్చిన పెద బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏడాది క్రితమే అతని పెద్దకూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. రైల్వేపోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News