ప్ర‌పంచంలోనే పెద్ద రాజ‌కీయ పార్టీ..

భార‌తీయ జ‌న‌తా పార్టీ చాలా రికార్డులు నెల‌కొల్పుతోంది. మిత్ర‌ప‌క్షాల అవ‌స‌రంల లేకుండాఏ మోదీ మేజిక్‌తో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌పంచంలోనే అతి పెద్ద రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించింది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా వెల్ల‌డించారు. గ‌త న‌వంబర్‌లో ప్రారంభించిన స‌భ్య‌త్వ న‌మోదు అత్యంత వేగంగా సాగి ప‌దిన్న‌ర కోట్ల స‌భ్య‌త్వాలు న‌మోద‌య్యాయ‌ని షా చెప్పారు. ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ప‌ది కోట్ల స‌భ్య‌త్వం దాటిన పార్టీ లేనేలేద‌ని అమిత్ తెలిపారు. గ‌తంలో […]

Advertisement
Update:2015-04-30 19:04 IST
భార‌తీయ జ‌న‌తా పార్టీ చాలా రికార్డులు నెల‌కొల్పుతోంది. మిత్ర‌ప‌క్షాల అవ‌స‌రంల లేకుండాఏ మోదీ మేజిక్‌తో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌పంచంలోనే అతి పెద్ద రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించింది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా వెల్ల‌డించారు. గ‌త న‌వంబర్‌లో ప్రారంభించిన స‌భ్య‌త్వ న‌మోదు అత్యంత వేగంగా సాగి ప‌దిన్న‌ర కోట్ల స‌భ్య‌త్వాలు న‌మోద‌య్యాయ‌ని షా చెప్పారు. ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ప‌ది కోట్ల స‌భ్య‌త్వం దాటిన పార్టీ లేనేలేద‌ని అమిత్ తెలిపారు. గ‌తంలో చైనా క‌మ్యూనిస్ట్ పార్టీకి ఈ చ‌రిత్ర ఉండేది. ఇప్ప‌డు కాషాయ పార్టీ చైనా పార్టీని అధిగ‌మించింది. అధికారంలో ఉంటే ఏదైనా సాధ్య‌మేన‌ని బీజేపీ రుజువు చేసింది.
Tags:    
Advertisement

Similar News