ఆత్మహత్యలు చేసుకున్న రైతులు నేరగాళ్ళట!
రైతుల ఆత్మహత్యలపై హర్యానా బీజేపీ ప్రభుత్వంలోని మంత్రి ఓ.పి. ధన్‌కర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర తీశాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులు అత్యంత పిరికివారని, బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే వారు సమాజాన్ని వదిలి చనిపోయారని ఆయన అన్నారు. మరో అడుగు ముందుకేసి వారిని నేరగాళ్ళుగా అభివర్ణించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలాంటి వారిని పరామర్శించడం వల్ల సానుభూతి కోసం మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పడతారని ధన్‌కర్ అన్నారు. ఆత్మహత్యలు […]
Advertisement
రైతుల ఆత్మహత్యలపై హర్యానా బీజేపీ ప్రభుత్వంలోని మంత్రి ఓ.పి. ధన్‌కర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర తీశాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులు అత్యంత పిరికివారని, బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే వారు సమాజాన్ని వదిలి చనిపోయారని ఆయన అన్నారు. మరో అడుగు ముందుకేసి వారిని నేరగాళ్ళుగా అభివర్ణించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలాంటి వారిని పరామర్శించడం వల్ల సానుభూతి కోసం మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పడతారని ధన్‌కర్ అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ఎవరికీ కూడా నష్ట పరిహారం ఇవ్వకూడదని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతాపార్టీ నాయకులు చేస్తున్న ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి తలనొప్పులు తెస్తున్నా… మోడీ వంటి వారు పిలిచి చీవాట్లు పెట్టినా ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు.
Advertisement