ముప్పు ముంగిట్లో 38 భార‌త్ నగరాలు!

న్యూఢిల్లీ : ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, కొచ్చి, తిరువనంతపురం, పాట్నా, అహ్మదాబాద్‌, డెహ్రాడూన్‌ సహా భారతదేశంలోని 38 నగరాలకు మధ్యస్థం నుంచి తీవ్ర, అతి తీవ్ర భూకంప ముప్పు పొంచి ఉంది. ముంబై, చెన్నై, కోల్‌కతా ఒక మాదిరి ముప్పుగల జోన్‌-3లో ఉండగా, ఢిల్లీ తీవ్ర ముప్పుగల జోన్‌ 4లో ఉంది. శ్రీనగర్‌, గౌహ‌తి, షిల్లాంగ్‌, కోహిమా, అగర్తలా, ఇటానగర్‌, ఇంఫాల్‌ తదితర నగరాలు అత్యంత తీవ్ర ప్రమాదం గల హైరిస్క్‌ జోన్‌-5లో ఉన్నాయి.  దేశంలో […]

Advertisement
Update:2015-04-27 20:10 IST
న్యూఢిల్లీ : ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, కొచ్చి, తిరువనంతపురం, పాట్నా, అహ్మదాబాద్‌, డెహ్రాడూన్‌ సహా భారతదేశంలోని 38 నగరాలకు మధ్యస్థం నుంచి తీవ్ర, అతి తీవ్ర భూకంప ముప్పు పొంచి ఉంది. ముంబై, చెన్నై, కోల్‌కతా ఒక మాదిరి ముప్పుగల జోన్‌-3లో ఉండగా, ఢిల్లీ తీవ్ర ముప్పుగల జోన్‌ 4లో ఉంది. శ్రీనగర్‌, గౌహ‌తి, షిల్లాంగ్‌, కోహిమా, అగర్తలా, ఇటానగర్‌, ఇంఫాల్‌ తదితర నగరాలు అత్యంత తీవ్ర ప్రమాదం గల హైరిస్క్‌ జోన్‌-5లో ఉన్నాయి. దేశంలో మొత్తం 235 జిల్లాలు తీవ్ర, అతి తీవ్ర ముప్పు గల జోన్‌-4 5లలో ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు.. 2011లోనే భారత జాతీయ విపత్తుల‌ నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) చేసిన హెచ్చరిక! అంతేకాదు.. భారత ఉపఖండంలోని 58.6 శాతం భూభాగంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని ఎన్డీఎంఏ పేర్కొంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలను అదృష్టవశాత్తూ అత్యంత తీవ్రస్థాయి గల భూకంపాలు ఎప్పుడూ కుదిపివేయలేదుగానీ.. అలాంటిదేదైనా సంభవిస్తే పెను విషాదమే సంభవిస్తుందని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News