హైద‌రాబాద్‌లో ఔష‌ధ‌ దాడులు

హైద‌రాబాద్‌లోని 11 కార్పొరెట్ ఆస్ప‌త్రుల్లోని మందుల దుకాణాల్లో ఔష‌ధ నియంత్ర‌ణ అధికారులు దాడులు చేశారు. ఈ దుకాణాల్లో నాసిర‌కం మందులు విక్ర‌యిస్తున్న‌ట్టు గుర్తించారు. అంతేకాకుండా మందులు అధిక ధ‌ర‌కు విక్ర‌యించ‌డం…, నాణ్య‌త లేమిని ఏ మాత్రం ప‌ట్టించుకోక పోవ‌డం, భ‌ద్ర‌ప‌రిచే విధానంలో అనేక లోపాలుండ‌డం, రికార్డుల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా లేక‌పోవ‌డం, ప‌రిశుభ్ర‌త పాటించ‌క పోవ‌డం గుర్తించారు. కార్పొరెట్ ఆస్ప‌త్రుల్లో ఇలాంటి ప‌రిస్థితులుండ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. రెండు కార్పొరేట్‌ ఆస్ప‌త్రుల్లో నిర్వ‌హిస్తున్న‌ లైసెన్సుల్లేని దుకాణాల మూసివేత‌కు ఆదేశించారు.అక్క‌డి […]

Advertisement
Update:2015-04-21 19:14 IST
హైద‌రాబాద్‌లోని 11 కార్పొరెట్ ఆస్ప‌త్రుల్లోని మందుల దుకాణాల్లో ఔష‌ధ నియంత్ర‌ణ అధికారులు దాడులు చేశారు. ఈ దుకాణాల్లో నాసిర‌కం మందులు విక్ర‌యిస్తున్న‌ట్టు గుర్తించారు. అంతేకాకుండా మందులు అధిక ధ‌ర‌కు విక్ర‌యించ‌డం…, నాణ్య‌త లేమిని ఏ మాత్రం ప‌ట్టించుకోక పోవ‌డం, భ‌ద్ర‌ప‌రిచే విధానంలో అనేక లోపాలుండ‌డం, రికార్డుల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా లేక‌పోవ‌డం, ప‌రిశుభ్ర‌త పాటించ‌క పోవ‌డం గుర్తించారు. కార్పొరెట్ ఆస్ప‌త్రుల్లో ఇలాంటి ప‌రిస్థితులుండ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. రెండు కార్పొరేట్‌ ఆస్ప‌త్రుల్లో నిర్వ‌హిస్తున్న‌ లైసెన్సుల్లేని దుకాణాల మూసివేత‌కు ఆదేశించారు.అక్క‌డి మందుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు ఆస్ప‌త్రుల్లో తీవ్ర ఉల్లంఘ‌న‌ల‌ను గుర్తించారు. ఒక స‌హాయ సంచాల‌కుడు, ముగ్గురు డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లతో కూడిన 11 ప్ర‌త్యేక త‌నిఖీ బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. లోపాలు గుర్తించిన మందుల షాపుల‌న్నింటిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News