జెబీ పట్నాయక్ కన్నుమూత
తిరుపతి:: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఒడిషా మాజీ ముఖ్యమంత్రి జె.బి. పట్నాయక్ కన్ను మూశారు. ఆయన ఒడిషా రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 88 సంవత్సరాల ఆయన పూర్తి పేరు జానకి బల్లభ పట్నాయక్.. ఆయన అస్పాం గవర్నర్‌గా కూడా పని చేశారు. 1980 నుంచి 89 వరకు వరుసగా రెండుసార్లు, 1995 నుంచి 99 వరకు మరోసారి మొత్తం మూడుసార్లు ఆయన ఒడిషా సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా, […]
Advertisement
తిరుపతి:: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఒడిషా మాజీ ముఖ్యమంత్రి జె.బి. పట్నాయక్ కన్ను మూశారు. ఆయన ఒడిషా రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 88 సంవత్సరాల ఆయన పూర్తి పేరు జానకి బల్లభ పట్నాయక్.. ఆయన అస్పాం గవర్నర్‌గా కూడా పని చేశారు. 1980 నుంచి 89 వరకు వరుసగా రెండుసార్లు, 1995 నుంచి 99 వరకు మరోసారి మొత్తం మూడుసార్లు ఆయన ఒడిషా సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఆయన పదవులు నిర్వర్తించారు. 2009 నుంచి ఆయన అస్సం గవర్నర్‌గా కూడా పని చేశారు. 18వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. పట్నాయక్ మృతదేహాన్ని ఒడిషాకు తరలిస్తున్నారు.
Advertisement