జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని, వారికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని తమ చిత్తశుద్ధిని చాటుకుంటామని నీటి పారుదల మంత్రి టి హరీశ్‌రావు ప్రకటించారు. జర్నలిస్టులకు మెరుగైన పథకాలను అమలు చేయడం కోసమే కొంత జాప్యం జరుగుతోందన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులను త్వరలోనే ఇవ్వనున్నట్టు ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని నిర్మించుకునే ఆర్థిక స్థోమత వారికి ఉండదని, ప్రభుత్వమే రెండు పడక గదుల ఇళ్లు కట్టించాలని […]

Advertisement
Update:2015-04-20 05:40 IST
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని, వారికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని తమ చిత్తశుద్ధిని చాటుకుంటామని నీటి పారుదల మంత్రి టి హరీశ్‌రావు ప్రకటించారు. జర్నలిస్టులకు మెరుగైన పథకాలను అమలు చేయడం కోసమే కొంత జాప్యం జరుగుతోందన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులను త్వరలోనే ఇవ్వనున్నట్టు ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని నిర్మించుకునే ఆర్థిక స్థోమత వారికి ఉండదని, ప్రభుత్వమే రెండు పడక గదుల ఇళ్లు కట్టించాలని నిర్ణయించిందని మంత్రి వివరించారు. అలాగే హైదరాబాద్‌లో పది కోట్ల రూపాయలతో జర్నలిస్టు భవన్ నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Tags:    
Advertisement

Similar News