ప‌రువు తీసిన ప‌చ్చ‌చొక్కాలు

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయం ఆదివారం యుద్ధకాండకు వేదికగా మారింది. మంగళగిరి రూరల్ మండల తెలుగు యువత, తాడేపల్లి కమిటీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పార్టీలో సీనియర్లను కాదని కాంగ్రెస్‌ నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన వారిని అందలమెక్కిస్తూ కీలకమైన పదవులను ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా తాడేపల్లి కమిటీ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది. సీనియర్లయిన మేకా పుల్లారెడ్డి, కళ్లం బాపిరెడ్డి, నూతక్కి ఏడుకొండలును కాదని, […]

Advertisement
Update:2015-04-20 06:07 IST
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయం ఆదివారం యుద్ధకాండకు వేదికగా మారింది. మంగళగిరి రూరల్ మండల తెలుగు యువత, తాడేపల్లి కమిటీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పార్టీలో సీనియర్లను కాదని కాంగ్రెస్‌ నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన వారిని అందలమెక్కిస్తూ కీలకమైన పదవులను ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా తాడేపల్లి కమిటీ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది. సీనియర్లయిన మేకా పుల్లారెడ్డి, కళ్లం బాపిరెడ్డి, నూతక్కి ఏడుకొండలును కాదని, ఇటీవలే పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్‌నేత ఇట్టా పెంచలయ్యను తాడేపల్లి కమిటీ అధ్యక్షునిగా ప్రకటించడం తీవ్రగందరగోళానికి దారితీసింది. ఒక‌ద‌శ‌లో కుర్చీలు ఒక‌రిపై ఒక‌రు వేసుకుంటూ బాహాబాహీకి దిగారు. కార్యాల‌య అద్దాలు ప‌గుల‌గొట్టారు. అంతకుముందు మంగళగిరి రూరల్‌ మండల, తెలుగు యువత అధ్యక్ష ఎన్నికలు కూడా గందరగోళానికి దారితీయడంతో పరిశీలకులు వాటిని వాయిదా వేశారు.
Tags:    
Advertisement

Similar News