మంత్రి మాణిక్యాలరావుకు అవమానం!
బెజవాడలోని దుర్గమ్మ సాక్షిగా మంత్రి మాణిక్యాలరావుకు అవమానం జరిగింది. దేవాలయంలోని రాజగోపురం మహామండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన దుర్గమ్మ ఆలయానికి వచ్చారు. పారంభోత్సవ కార్యక్రమం వద్ద చెక్కిన శిలాపలకంపై ఆయన పేరును ఓ పద్ధతి ప్రకారం రాయలేదు. ఈ విషయంపై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రొటోకాల్ పాటించలేదని ఆలయ అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మరో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మంత్రిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఆయన పట్టించుకోలేదు. కనీసం […]
Advertisement
బెజవాడలోని దుర్గమ్మ సాక్షిగా మంత్రి మాణిక్యాలరావుకు అవమానం జరిగింది. దేవాలయంలోని రాజగోపురం మహామండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన దుర్గమ్మ ఆలయానికి వచ్చారు. పారంభోత్సవ కార్యక్రమం వద్ద చెక్కిన శిలాపలకంపై ఆయన పేరును ఓ పద్ధతి ప్రకారం రాయలేదు. ఈ విషయంపై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రొటోకాల్ పాటించలేదని ఆలయ అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మరో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మంత్రిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఆయన పట్టించుకోలేదు. కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయారు.-పీఆర్
Advertisement