Telugu Global
NEWS

మోదీ, అదానీలపై శ్రీలంక ప్రజల్లో ఆగ్రహం

ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అధ్యక్షభవనాన్నే ఆక్రమించుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాని విక్రమ సింఘే కూడా రాజీనామా చేశారు. అయినప్పటికీ అక్కడ ప్రజల నిరసనలు ఆగడంలేదు. అక్కడి నిరసనకారులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మిత్రుడు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మీద కూడా నిప్పులు చెరుగుతున్నారు. తమ దేశాన్ని సర్వనాశనం చేసిన తమ నాయకులను తమ చెప్పుచేతుల్లో […]

మోదీ, అదానీలపై శ్రీలంక ప్రజల్లో ఆగ్రహం
X
ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అధ్యక్షభవనాన్నే ఆక్రమించుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాని విక్రమ సింఘే కూడా రాజీనామా చేశారు. అయినప్పటికీ అక్కడ ప్రజల నిరసనలు ఆగడంలేదు.
అక్కడి నిరసనకారులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మిత్రుడు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మీద కూడా నిప్పులు చెరుగుతున్నారు. తమ దేశాన్ని సర్వనాశనం చేసిన తమ నాయకులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకొని లాభం పొందాలని చూస్తున్నారని శ్రీలంక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీకి, అదానీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
శ్రీలంకలోని ఓ పవర్ ప్రాజెక్టును అదానీ గ్రూపుకు ఇవ్వడానికి మోదీ సర్కార్ శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందన్న వార్తలు అక్కడి ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి.కొద్ది కాలం క్రితం సిలోన్ విధ్యుత్తు బోర్డు ఛీఫ్ ఫెర్డినాండో ఆ దేశ పార్లమెంటు కమిటీ ముందు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అదానీ గ్రూపుకు ఇవ్వాలంటూ మోదీ తనపై వత్తిడి చేస్తున్నట్టు అధ్యక్షుడు రాజపక్సే తనకు చెప్పాడంటూ ఫెర్డినాండో బహిర్గతపర్చాడు. అయితే ఫెర్డినాండో మాటలను రాజపక్సే ఖండించడం తర్వాత జరిగిన పరిణామాలతో సిలోన్ విధ్యుత్తు బోర్డు ఛీఫ్ పదవికి ఫెర్డినాండో రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ప్రజలు మాత్రం ఆ విషయాన్ని మరవడం లేదు.
'అదానీ పర్యావరణ శత్రువు' అని, 'అదానీ నీవల్ల నిరాశకు గురయ్యాము'అని, 'మోదీ మా సంక్షోభాన్ని నీ స్వార్దానికి ఉపయోగించుకోకు' అని , భారత్ , 'శ్రీలంక ప్రజల మధ్య బంధం ఉంది కానీ రాజకీయ నాయకుల మధ్య కాదు' అని ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నారు.
తమ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కుటుంబంతో సహా అంతే కోపాన్ని శ్రీలంక ప్రజలు అదానీ, మోదీలపై చూయించడం భారత్ కు ఇబ్బందికరమే. తన మిత్రుడి లాభాల కోసం దేశంలోనే కాక విదేశాల్లో కూడా తన పలుకుబడిని ఉపయోగిస్తున్న ప్రధాని మోదీ తీరుపట్ల సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు.
Sri Lankans continue protesting against Adani being favoured by PM Modi and Rajapakse
First Published:  13 July 2022 2:28 AM IST
Next Story