Telugu Global
Videos

థాంక్యూ ట్రయిలర్ రివ్యూ

ఓ మనిషి సక్సెస్ అయ్యాడంటే అతి అతడి గొప్పదనం మాత్రమే కాదు. అతడి ఎదుగుదలకు ఎంతోమంది సాయం చేసి ఉంటారు, మరికొందరు పరోక్షంగా పనికొచ్చి ఉంటారు. అలాంటి వాళ్లందర్నీ గుర్తుపెట్టుకోవాలి, వీలైతే జీవితంలో ఒకసారైనా వాళ్లను మళ్లీ కలవాలి. నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా థీమ్ ఇదే. కొద్ది సేపటి కిందట విడుదలైన ట్రయిలర్ లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. నాగచైతన్య థాంక్యూ సినిమా కథ ఏంటి? అందులో ఎమోషన్ ఏంటనే విషయాన్ని ట్రయిలర్ […]

థాంక్యూ ట్రయిలర్ రివ్యూ
X

ఓ మనిషి సక్సెస్ అయ్యాడంటే అతి అతడి గొప్పదనం మాత్రమే కాదు. అతడి ఎదుగుదలకు ఎంతోమంది సాయం చేసి ఉంటారు, మరికొందరు పరోక్షంగా పనికొచ్చి ఉంటారు. అలాంటి వాళ్లందర్నీ గుర్తుపెట్టుకోవాలి, వీలైతే జీవితంలో ఒకసారైనా వాళ్లను మళ్లీ కలవాలి. నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా థీమ్ ఇదే. కొద్ది సేపటి కిందట విడుదలైన ట్రయిలర్ లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు.

నాగచైతన్య థాంక్యూ సినిమా కథ ఏంటి? అందులో ఎమోషన్ ఏంటనే విషయాన్ని ట్రయిలర్ లో క్లియర్ గా చెప్పేశారు. టీనేజ్ అబ్బాయిగా, కాలేజ్ స్టూడెంట్ గా, సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా.. ఇలా 3 డిఫరెంట్ షేడ్స్ లో నాగచైతన్యను ట్రయిలర్ లో ప్రొజెక్ట్ చేశారు. ప్రతి దశలో ఓ గర్ల్ ఫ్రెండ్ ను పెట్టారు.

టీనేజ్ లో అవికా గోర్ ను, కాలేజ్ డేస్ లో మాళవిక నాయర్ ను, ఇక కెరీర్ లో ఉన్నప్పుడు రాశిఖన్నాను హీరోయిన్లుగా చూపించారు. మధ్యలో వచ్చే నాగచైతన్య ఫ్రెండ్స్ బ్యాచ్ ను కూడా ట్రయిలర్ లో చూపించారు. ఇలా మొత్తం చెప్పేసిన ఈ సినిమాలో అసలు ఎమోషన్ ఏంటనేది మాత్రం దాచిపెట్టారు.

టీజర్ లో నాగచైతన్య లుక్స్, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కింది థాంక్యూ సినిమా. జులై 22న ఈ సినిమా విడుదలకానుంది.

First Published:  12 July 2022 1:53 PM IST
Next Story