Telugu Global
MOVIE UPDATES

పుష్ప-2.. ఇది రూ.350 కోట్ల ప్రాజెక్టు

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. దీంతో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు, పార్ట్-2 హక్కుల్ని దక్కించుకునేందుకు చాలా బాలీవుడ్ సంస్థలు పోటీ పడుతున్నాయి. భారీగా ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. దీంతో పుష్ప-2 తమకు కాసులు కురిపిస్తుందనే విషయం అల్లు అర్జున్ కు, మేకర్స్ కు అర్థమైపోయింది. అంతే.. అమాంతం రేట్లు పెంచేశారు. పుష్ప-2 కోసం అల్లు అర్జున్ 90 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట. అక్కడితో […]

allu-arjun-about-pushpa
X

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. దీంతో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు, పార్ట్-2 హక్కుల్ని దక్కించుకునేందుకు చాలా బాలీవుడ్ సంస్థలు పోటీ పడుతున్నాయి. భారీగా ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. దీంతో పుష్ప-2 తమకు కాసులు కురిపిస్తుందనే విషయం అల్లు అర్జున్ కు, మేకర్స్ కు అర్థమైపోయింది. అంతే.. అమాంతం రేట్లు పెంచేశారు.

పుష్ప-2 కోసం అల్లు అర్జున్ 90 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట. అక్కడితో విషయం అయిపోలేదు. సినిమా బిజినెస్ లో వాటా కూడా అడుగుతున్నాడట. అలా పుష్ప-2తో 110 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించాలని బన్నీ డిసైడ్ అయ్యాడు. అటు సుకుమార్ రెమ్యూనరేషన్ కూడా మూడింతలు పెరిగింది. అలా హీరోకు దర్శకుడికే అటుఇటుగా 145 కోట్ల రూపాయలు వెళ్తోంది.

పార్ట్-1 కోసం 18 కోట్లు తీసుకున్న సుకుమార్, పార్ట్-2 కోసం ఏకంగా 45 నుంచి 50 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు. అయితే ఈ ఎమౌంట్ సుకుమార్ డిమాండ్ చేయలేదు. ఆటోమేటిగ్గా అతడి రేటు పెరిగిందంతే. ఇక ఇతర నటీనటుల రెమ్యూనరేషన్లు కూడా కాస్త పెంచారు. క్యారెక్టర్ ఆర్టిస్టులకే 75 కోట్ల రూపాయలు అవుతుందంట.

ఇవన్నీ కలిపి చూస్తే, పుష్ప-2 బడ్జెట్ 350 కోట్ల రూపాయలకు చేరుకున్నట్టు తెలుస్తోంది. సినిమా పూర్తయ్యేసరికి ఈ బడ్జెట్ మరో 20 కోట్లు పెరగొచ్చనేది అంచనా. ఆగస్ట్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలనేది ప్లాన్.

First Published:  12 July 2022 7:31 AM IST
Next Story