Telugu Global
National

వ‌చ్చే యేడాదికి ప్రపంచంలో మనమే నెంబర్ వన్

అవును నిజమే వచ్చే ఏడాదికి ప్రపంచంలో మనమే నెంబర్ వన్ అవబోతున్నాం. చైనాకన్నా పై స్థానానికి చేరుకోబోతున్నాం. ఏ విషయంలో అనేది పక్కన పెడితే ఈ వార్త చాలా అనందంగా ఉంది కదా ! కానీ ఇది ఆనందించాల్సిన వార్తేమీ కాదు. మనం చైనాను కూడా అధిగమించి ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేది జనాభాలో. భార‌త్ వ‌చ్చే యేడాదినాటికి జ‌నాభాలో చైనాను అధిగ‌మించి ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా గ‌ల దేశంగా ఆవిర్భ‌వించ నున్న‌దని ఐక్యరాజ్య‌స‌మితి (ఐరాస‌) తెలిపింది.. […]

వ‌చ్చే యేడాదికి ప్రపంచంలో మనమే నెంబర్ వన్
X

అవును నిజమే వచ్చే ఏడాదికి ప్రపంచంలో మనమే నెంబర్ వన్ అవబోతున్నాం. చైనాకన్నా పై స్థానానికి చేరుకోబోతున్నాం. ఏ విషయంలో అనేది పక్కన పెడితే ఈ వార్త చాలా అనందంగా ఉంది కదా ! కానీ ఇది ఆనందించాల్సిన వార్తేమీ కాదు. మనం చైనాను కూడా అధిగమించి ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేది జనాభాలో.

భార‌త్ వ‌చ్చే యేడాదినాటికి జ‌నాభాలో చైనాను అధిగ‌మించి ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా గ‌ల దేశంగా ఆవిర్భ‌వించ నున్న‌దని ఐక్యరాజ్య‌స‌మితి (ఐరాస‌) తెలిపింది.. 2022లో చైనా 1,426 మిలియన్ల (142.6 కోట్లు.)తో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కాగా, భారతదేశం 1,412 మిలియన్ల (141.2 కోట్లు),జనాభా క‌లిగి ఉంద‌ని తెలిపింది. ఈ ఏడాది నవంబర్‌ 15తో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కును దాటుతుందని ఐరాస అంచ‌నా వేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐరాస విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఐరాస అంచనాల మేర‌కు 2050 నాటికి, భారతదేశ జనాభా 1,668 మిలియన్లకు చేరుకుంటుందని, చైనా జనాభా 1,317 మిలియన్లకు చేరుకుంటుంది. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుకుంటుందని తెలిపింది.

2022లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన తూర్పు , ఆగ్నేయ ఆసియా ప్రాంతాలు 2.3 బిలియన్ల జనాభాతో ప్రపంచ జనాభాలో 29 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయ‌ని తెలిపింది.మధ్య,దక్షిణ ఆసియా ప్రాంతాలు 2.1 బిలియన్లతో (26 శాతం) ఉన్నాయ‌ని తెలిపింది. చైనా,భారతదేశం ఈ ప్రాంతాలలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. 2022లో ఒక్కొక్కటి 1.4 బిలియన్లకు పైగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. మధ్య, దక్షిణాసియాప్రాంతం 2037 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగా అవతరిస్తుందని అంచనా. 030లో ప్రపంచ జనాభా 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు, 2100లో 10.4 బిలియన్లకు పెరగవచ్చని ఐరాస తాజా అంచనాలు సూచిస్తున్నాయి.

సంతానోత్పత్తి రేట్లు క్షీణిస్తున్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణ , వైద్యరంగంలో పురోగతి సాధించ‌డంతో మరణాల రేట్లు తగ్గుతున్నాయి. ఈ అకాల మరణాల తగ్గింపు, పెరిగిన ఆయుర్దాయం జనాభా పెరుగుదలకు కార‌ణ‌మ‌వుతోందద‌ని ఐరాస పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా, 1990 నుండి దాదాపు 9 సంవత్సరాల ఆయుర్దాయం పెరుగుతూ 2019లో 72.8 సంవత్సరాలకు చేరుకుందని తెలిపింది. మరణాల సంఖ్య మరింత తగ్గి 2050లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం 77.2 సంవత్సరాలుగా ఉంటుంద‌ని తెలిపింది. 2022లో 10 శాతం నుండి 2050లో 16 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు వచ్చాయి. 1950 తర్వాత తొలిసారిగా ఐరాస 2020లో జ‌నాభా గ‌ణ‌న‌చేసింది. జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 1 శాతం కంటే తక్కువగా ఉంద‌ని, ఇది రాబోయే కొన్ని దశాబ్దాల్లో ..ఈ శతాబ్దం చివరి వరకు ఈ విధంగానే కొనసాగుతుందని అంచనా వేసింది. 1990లో చైనా జనాభా 1,144 మిలియన్లు ఉండగా, అప్ప‌ట్లో భారతదేశం లో జ‌నాభా 861 మిలియన్లుగా ఉంది.

ప్రపంచ జనాభా 2030లో 850 కోట్లకు, 2050లో 970 కోట్లకు, 2080లో 1,040 కోట్లకు చేరి, అక్కడి నుంచి 2100 వరకు నిలకడగా ఉంటుందని అంచనా వేసింది. రానున్న ముప్పై ఏండ్లలో పెరిగే ప్రపంచ జనాభాలో సగానికి పైగా కేవలం ఎనిమిది దేశాల్లోనే(డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, టాంజానియా) ఉంటుందని తెలిపింది.

First Published:  11 July 2022 8:11 PM GMT
Next Story