సీఎం కు చల్లారిన టీ ఇచ్చాడని అధికారికి షో కాజ్ నోటీస్!
అధికారంలో ఉన్న వారి పట్ల వినయ విధేయతలతో పాటు మర్యాదలు సక్రమంగా చేసుకోవాలి. అలా చేసుకోకపోయినా, అందుకు పురమాయించిన వారు అలా చూసుకోకపోయినా సంబంధించిన వారికి తిప్పలు తప్పవు. అక్షింతలు పడక మానవు. సరిగ్గా ఇలాగే జరిగింది మద్య ప్రదేశ్ లో ఓ అధికారికి. ఇంతకీ ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన పర్యటన లో భాగంగా ఖజురహోలో కొద్దిసేపు ఆగిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కన్హువా […]
అధికారంలో ఉన్న వారి పట్ల వినయ విధేయతలతో పాటు మర్యాదలు సక్రమంగా చేసుకోవాలి. అలా చేసుకోకపోయినా, అందుకు పురమాయించిన వారు అలా చూసుకోకపోయినా సంబంధించిన వారికి తిప్పలు తప్పవు. అక్షింతలు పడక మానవు. సరిగ్గా ఇలాగే జరిగింది మద్య ప్రదేశ్ లో ఓ అధికారికి. ఇంతకీ ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన పర్యటన లో భాగంగా ఖజురహోలో కొద్దిసేపు ఆగిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కన్హువా కు విమానాశ్రయ లాంజ్‌లో ప్రముఖులకు అల్పాహారం ,టీ అందించే పనిని అప్పజెప్పారు. ఆయన ముఖ్యమంత్రికి అల్పాహారాన్ని( బ్రేక్ ఫాస్ట్) , టీ ని అందించారు. అయితే ఆయన ఇచ్చిన టిఫిన్, టీ చల్లారిపోయాయని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారట. దీనిపై ఛతర్‌పూర్ జిల్లా రాజ్‌నగర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఆ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కి షో-కాజ్ నోటీసు జారీ చేశారు. 'మీరు శిక్షార్హమైన తప్పు చేశారు. మీపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని' ఆ నోటీసులో పేర్కొన్నారు.
"ముఖ్యమంత్రికి నాసిరకం భోజనం (అల్పాహారం) వడ్డించారని మాకు తెలిసింది. అలాగే, ఆయనకు అందించే టీ కూడా చల్లగా ఉంది. సిఎం ప్రోటోకాల్‌ను నిర్వహించడం లో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా, అనుచితంగా ప్రవర్తించింది. ఇది ప్రొటోకాల్ విధులను ప్రశ్నార్ధకం చేస్తోంది. చాలా ముఖ్యమైన (వివిఐపి) వ్యక్తుల విషయంలో నిర్వర్తించాల్సిన విధులను చాలా తేలిగ్గా తీసుకున్నారు. మీ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు. " అని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కన్హువాకు నోటీసు జారీ చేశారు.
లోక్‌సభ ఎంపీ ,మధ్యప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు వి.డి. శర్మ తో కలిసి సీఎం చౌహాన్ కట్నీకి వెళ్లే ముందు, రాబోయే మున్సిపల్ ఎన్నికలపై చర్చించడానికి విమానాశ్రయంలో కొచెం సేపు పార్టీ కార్యకర్తలతో సమావేశమయినప్పుడు ఈ సంఘటన జరిగింది.