జాతీయ చిహ్నం పై రగడ..ప్రధానిపై విపక్షాల ధ్వజం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నం విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ జాతీయ చిహ్నాన్ని వక్రీకరించారని విపక్ష సభ్యులతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు,చరిత్రకారులు విమర్శిస్తున్నారు. కొత్తగా ఆవిష్కరించిన ఈ చిహ్నం భఃంగిమ దూకుడు స్వభావంతో బెదిరించే ధోరణిలో ఉందని దీనిని తక్షణమే మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కొత్త చిహ్నం మోడీ మార్క్ భారత దేశం గా ఉందని మండిపడుతున్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, […]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నం విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ జాతీయ చిహ్నాన్ని వక్రీకరించారని విపక్ష సభ్యులతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు,చరిత్రకారులు విమర్శిస్తున్నారు. కొత్తగా ఆవిష్కరించిన ఈ చిహ్నం భఃంగిమ దూకుడు స్వభావంతో బెదిరించే ధోరణిలో ఉందని దీనిని తక్షణమే మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కొత్త చిహ్నం మోడీ మార్క్ భారత దేశం గా ఉందని మండిపడుతున్నారు.
ప్రధాని మోడీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ప్రతిపక్ష నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సమక్షంలో ప్రధాని జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు.
ప్రధాని మోడీ "అమృత్ కాల్" వ్యాఖ్యల ను ఉటంకిస్తూ .."అసలు చిహ్నంలో మృదువైన వ్యక్తీకరణ ఉంటుందని, అయితే అమృత్ కాల్ సమయంలో నిర్మించింది మాత్రం దేశంలో అన్నీ మింగేసే మ్యాన్ ఈటర్ తరహాలో ఉందని రాష్ట్రీయ జనతా దళ్ విమర్శించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా పాత, కొత్త రెండు చిత్రాలను మాత్రం పోస్ట్ చేశారు.
"నరేంద్ర మోడీ జీ, దయచేసి సింహం ముఖాన్ని గమనించండి, అది గ్రేట్ సారనాథ్ విగ్రహమా? జిఐఆర్ లో చూపిన సింహం రూపాన్ని వక్రీకరించినట్టు సూచిస్తుంది. దయచేసి దాన్నిఒక సారి చెక్ చేయండి. పరీక్షగా చూడండి . అవసరమైతే, దానిని సరిగా సరిదిద్దండి," అని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
"మన జాతీయ చిహ్నమైన అశోకనస్తంభంపై సింహాలకు అవమానం. ఒరిజినల్ ఎడమవైపున అసలైన రూపం మనోహరంగా, నమ్మకంగా ఉంది. కుడివైపున ఉన్నది కొత్త పార్లమెంటు భవనం పైన ఉంచిన మోడీ వెర్షన్. ఇది అవమానకరంగా ఉంది. దీనిని వెంటనే మార్చండి" అని కామెంట్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జవహర్ సిర్కార్ ట్విట్టర్‌లో జాతీయ చిహ్నం రెండు వేర్వేరు చిత్రాలను పోస్ట్ చేశారు.
కొత్త పార్లమెంటు భవనంపై మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై చరిత్రకారుడు ఎస్ ఇర్ఫాన్ హబీబ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. "మన జాతీయ చిహ్నంపై జోక్యం చేసుకోవడం పూర్తిగా అనవసరం. మన సింహాలు ఎందుకు క్రూరంగా కనిపించాలి? ఇవి 1950లో స్వతంత్ర భారతదేశం స్వీకరించిన అశోకుని సింహాలు" అని హబీబ్ అన్నారు.
"గాంధీ నుండి గాడ్సే వరకు; గంభీరంగా, శాంతియుతంగా కూర్చున్న సింహాలతో కూడిన మన జాతీయ చిహ్నం మారిపోయింది. సెంట్రల్ విస్టాలో నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంటు భవనం పై ఆవిష్కరించిన కొత్త జాతీయ చిహ్నం మాత్రం .. కోరలతో కూడిన కోపంతో ఉన్న సింహాలు. ఇది మోడీ యొక్క కొత్త భారతదేశం," అని సీనియర్ న్యాయవాది,సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.
భారతదేశ జాతీయ చిహ్నం మౌర్య సామ్రాజ్యం నాటి పురాతన శిల్పం అశోక స్తంభంపై ఉన్న సింహం తలను పోలి ఉంటుంది.
కొత్త జాతీయ చిహ్నం
నిన్న ప్రధాని మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నం కాంస్యంతో తయారు చేశారు. 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. చిహ్నాన్ని నిలిపేందుకు 6,500 కిలోల బరువున్న సపోర్టింగ్ స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది.