Telugu Global
NEWS

మద్దతు సరే.. బాబును ముర్ము కలుస్తారా?

బీజేపీ అడక్కపోయినప్పటికీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చేందుకు టీడీపీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. టీడీపీ వ్యూహాత్మక కమిటీ భేటీలో పార్టీ నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వెల్లడించింది. సామాజిక న్యాయానికి కట్టుబడే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు తెలిపారని ఆ పార్టీ ప్రకటించింది. సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందు వరుసలో ఉంటుందని.. గతంలో […]

మద్దతు సరే.. బాబును ముర్ము కలుస్తారా?
X

బీజేపీ అడక్కపోయినప్పటికీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చేందుకు టీడీపీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించింది.

టీడీపీ వ్యూహాత్మక కమిటీ భేటీలో పార్టీ నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వెల్లడించింది. సామాజిక న్యాయానికి కట్టుబడే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు తెలిపారని ఆ పార్టీ ప్రకటించింది.

సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందు వరుసలో ఉంటుందని.. గతంలో బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా బలపరిచిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగువాడైన పీవీ నరసింహారావు ప్రధాని అయిన సమయంలో నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఆయనకు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.

అయితే బీజేపీ నుంచి ఎలాంటి వినతి రాకపోయినప్పటికీ టీడీపీ ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వడం ఆసక్తిగా మారింది. తనను బలపరచాల్సిందిగా పార్టీలను కోరేందుకు ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు.

అప్పుడు టీడీపీ నేతలను ఆమె కలుస్తారా లేదా అన్నది చూడాలి. 2019కి ముందు చంద్రబాబు ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగ్గా.. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలనూ నాడు ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన రామ్‌నాథ్ కోవింద్ వచ్చి కలిశారు.

మరిప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును.. రాష్ట్రపతి అభ్యర్థి కలుస్తారా లేదా అన్నది చూడాలి. ఈనెల 12న ఆమె తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు.

First Published:  11 July 2022 10:56 AM IST
Next Story