Telugu Global
National

శ్రీలంక సంక్షోభం… అదానీకి కాసుల వర్షం

శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అదానీకి కాసుల వర్షం కురిపించడమేంటని ఆశ్చర్యంగా ఉందా..? కానీ ఇది నిజమే. శ్రీలంక ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు విమానాలకు వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) కూడా ఖాళీ అయిపోయింది. విమానాలకు ఇంధనం అందించలేమని శ్రీలంక ఎప్పుడో చేతులెత్తేసింది. శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి విమాన రాకపోకలు మాత్రం య‌ధావిధిగానే సాగుతున్నాయి. శ్రీలంక ఎయిర్‌లైన్స్, ఎయిర్ అరేబియా, జజీరా […]

శ్రీలంక సంక్షోభం… అదానీకి కాసుల వర్షం
X

శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అదానీకి కాసుల వర్షం కురిపించడమేంటని ఆశ్చర్యంగా ఉందా..? కానీ ఇది నిజమే. శ్రీలంక ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు విమానాలకు వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) కూడా ఖాళీ అయిపోయింది. విమానాలకు ఇంధనం అందించలేమని శ్రీలంక ఎప్పుడో చేతులెత్తేసింది.

శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి విమాన రాకపోకలు మాత్రం య‌ధావిధిగానే సాగుతున్నాయి. శ్రీలంక ఎయిర్‌లైన్స్, ఎయిర్ అరేబియా, జజీరా ఎయిర్‌వేస్, గల్ఫ్ ఎయిర్, ఎయిర్ ఏషియా తదితర అనేక సంస్థలు అనేక విమానాలను నడుపుతున్నాయి. అయితే వాటికి కావాల్సిన ఇంధనం కోసం ఆయా సంస్థలు దక్షిణ భారతదేశం విమానాశ్రయాలపై ఆధారపడుతున్నాయి.

ముఖ్యంగా అదానీ గ్రూపు నిర్వహిస్తున్న తిరువనంతపురం విమానాశ్ర‌యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అదే కాకుండా కోచి, చెన్నై విమానాశ్ర‌యాలను కూడా వినియోగిస్తున్నాయి. దాంతో తిరువనంతపురం, కొచ్చిన్, చెన్నై విమానాశ్రయాలలో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) అమ్మకాలు పెరిగాయి.

ATF అమ్మకాల వల్ల వచ్చే లాభాలు, దానిపై రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే పన్ను.. ఇవేకాక విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యి ఇంధనం నింపుకునేందుకు విమానాశ్రయాలు నిర్వహిస్తున్న సంస్థలు ఒక్కో విమానానికి లక్ష రూపాయలు వసూలు చేస్తాయి. అలా అదానీ నిర్వహిస్తున్న తిరువనంతపురంలో ఈనెల రోజుల్లో 90 విమానాలు ఇంధ‌నం నింపుకోవడానికి ల్యాండ్ అయ్యాయి.

ఇందులో సిడ్నీ, మెల్‌బోర్న్, ప్యారిస్‌లకు వెళ్లే శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన 55 విమానాలు ఉన్నాయి. జూన్ 29 నుండి కొచ్చి విమానాశ్రయం 28 విమానాలను నిర్వహించింది, వీటిలో శ్రీలంక ఎయిర్‌లైన్స్, ఎయిర్ అరేబియా, జజీరా ఎయిర్‌వేస్, ఎయిర్‌ ఏషియా విమానాలున్నాయి.

మొత్తానికి శ్రీలంక నుండి రాకపోకలు సాగిస్తున్న విమానాలు ఎక్కువగా తిరువనంతపురం విమానాశ్రయం మీదనే ఆధారపడుతుండటంతో ఆ విమానాశ్రయాన్ని నిర్వ‌హిస్తున్న అదానీ గ్రూపునకు కాసులపంట పండుతోంది.

First Published:  11 July 2022 1:50 PM IST
Next Story