తన గాయాన్ని బయటపెట్టిన రామ్
వారియర్ సినిమా కోసం తను అనుభవించిన బాధను బయటపెట్టాడు హీరో రామ్. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర పోషించిన ఈ నటుడు, ఆ రోల్ కోసం మేకోవర్ అయ్యే టైమ్ లో ప్రమాదానికి గురయ్యాడు. ఆ విషయాన్ని స్వయంగా బయటపెట్టిన ఈ హీరో, అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. “ఫస్ట్ టైమ్ ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళాను. పోలీస్ రోల్ కోసం ప్రిపేర్ కావడానికి ఒక నెల టైమ్ ఉంది. వర్కవుట్స్ చేద్దామని జిమ్‌కు వెళ్ళా. రోజుకు […]
వారియర్ సినిమా కోసం తను అనుభవించిన బాధను బయటపెట్టాడు హీరో రామ్. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర పోషించిన ఈ నటుడు, ఆ రోల్ కోసం మేకోవర్ అయ్యే టైమ్ లో ప్రమాదానికి గురయ్యాడు. ఆ విషయాన్ని స్వయంగా బయటపెట్టిన ఈ హీరో, అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
“ఫస్ట్ టైమ్ ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళాను. పోలీస్ రోల్ కోసం ప్రిపేర్ కావడానికి ఒక నెల టైమ్ ఉంది. వర్కవుట్స్ చేద్దామని జిమ్‌కు వెళ్ళా. రోజుకు రెండుసార్లు జిమ్ చేద్దామనుకుంటే… స్పైనల్ కార్డ్ దగ్గర ఇంజురీ అయ్యింది. మూడు నెలలైనా తగ్గలేదు.
డాక్టర్ దగ్గరకు వెళ్ళా. వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా? జిమ్‌కు వెళ్ళొచ్చా? అంటే… వన్ కిలోతో చేయొచ్చని చెప్పారు. అలా అయితే కష్టమని చెప్పా. అప్పుడు ‘మీకు సినిమా ఇంపార్టెంట్ ఆ? లైఫ్ ఇంపార్టెంట్ ఆ?’ అని డాక్టర్ ప్రశ్నించారు.”
ఆ పొజిషన్ లో ఇంటికొచ్చిన తను, సినిమాకే ప్రాధాన్యం ఇచ్చానని చెప్పుకొచ్చాడు రామ్. నెల రోజులు పట్టాల్సిన మేకోవర్ కోసం 3 నెలలు టైమ్ కేటాయించాల్సి వచ్చిందని తెలిపిన రామ్.. అభిమానుల ప్రేమ ముందు తన బాధ చాలా చిన్నదన్నాడు. వారియర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఈ వివరాలు చెప్పుకొచ్చాడు.
లింగుసామి దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈనెల 14న సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు రామ్. అందుకే చెన్నై, హైదరాబాద్ లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.