చేతనైతే ద్రౌపది ముర్ము జగన్ దగ్గరకు రాకుండా అడ్డుకోండి
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతును బీజేపీ కోరలేదని, వైసీపీ తమకు అంటరాని పార్టీ అంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. సత్యకుమార్ ఆటలో అరటిపండు లాంటి వారని.. అసలు ఆయన ఎవరో కూడా తనకు నిజంగానే ఇప్పటి వరకు తెలియదన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు జగన్‌కు ఫోన్ చేసి గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎంపిక చేయాలనుకుంటున్నాం.. మీ మద్దతు కావాలని కోరారని.. […]
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతును బీజేపీ కోరలేదని, వైసీపీ తమకు అంటరాని పార్టీ అంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. సత్యకుమార్ ఆటలో అరటిపండు లాంటి వారని.. అసలు ఆయన ఎవరో కూడా తనకు నిజంగానే ఇప్పటి వరకు తెలియదన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు జగన్‌కు ఫోన్ చేసి గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎంపిక చేయాలనుకుంటున్నాం.. మీ మద్దతు కావాలని కోరారని.. సత్యకుమార్ లాంటి ఆటలో అరటిపండ్లకు ఈ విషయాలు తెలిసి ఉండకపోచ్చన్నారు.
మరి వైసీపీ అంటరాని పార్టీ అయితే మద్దతు కోసం స్వయంగా ద్రౌపది ముర్ము ఎందుకు జగన్ వద్దకు వస్తున్నారని సత్యకుమార్‌ను ప్రశ్నించారు పేర్నినాని. సత్యకుమార్ లాంటి వారు చేతనైతే ఆమె జగన్ వద్దకు రాకుండా అడ్డుకోవాలని సవాల్ చేశారు. బాలకృష్ణ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకోరు కాబట్టే భయపడే చంద్రబాబునాయుడు టీడీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోలేదన్నారు. వైసీపీలో జగన్‌కు ఎదురు లేదు కాబట్టే శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకున్నామన్నారు. శాశ్వత అధ్యక్షుడిగా ఉండడం చెల్లుతుందా లేదా అన్నది కొద్దికాలం ఆగితే తేలుతుంది కదా ఎందుకు తొందర అని ప్రశ్నించారు.
ఊసరవెల్లితో పాటు చంద్రబాబు కూడా సిగ్గుపడేలా పవన్ కల్యాణ్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ వారు కౌరవులు.. అధికారంలో లేను కాబట్టి తాను పాండవుడిని అని పవన్ కల్యాణ్ మాట్లాడారని.. మరి 2014 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ అప్పుడు దుశ్శాసనుడి పాత్ర పోషించారా అని పేర్ని నాని ప్రశ్నించారు.
కోనసీమకే అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టాలి, కడప జిల్లాకు పెట్టుకోవచ్చు కదా అని.. అమలాపురం ఘటన రోజు మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మాత్రం అంబేద్కర్ పేరు పెడితే తొలుత స్వాగతించిన వ్యక్తిని తానేనని చెప్పుకుంటున్నారని విమర్శించారు. రౌడీయిజాన్ని సహించనని పెద్ద పోటుగాడిలా పవన్ మాట్లాడుతున్నారని.. మరి అనంతపురం జిల్లా వెళ్లి ఎవరి ఇంట్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. కాఫీ ఇచ్చిన వారు ఎంతోమందిని హత్య చేశారని.. బాగా హత్యలు చేసినందుకు శాలువా కప్పేందుకు వెళ్లారా అని పవన్‌ను నిలదీశారు.
పవన్ కల్యాణ్ సినిమాలను దెబ్బకొట్టింది ప్రజలే గానీ ప్రభుత్వం కాదన్నారు. వకీల్ సాబ్ సినిమా విఫలమైతే పంపిణీదారులకు ఒక్క రూపాయి అయినా వెనక్కు ఇచ్చావా అని నిలదీశారు. కుల ప్రభావం లేకపోతే సంతోషించాల్సిందిపోయి.. రాష్ట్రంలో కులభావం పోయిందని పవన్ బాధపడుతున్నారని పేర్నినాని విమర్శించారు.