Telugu Global
NEWS

తెలంగాణ రాజకీయాల్లో ఏక్ నాథ్ షిండేల రగడ..

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల్లో ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పేరు తెరపైకి వస్తోంది. మహారాష్ట్రలోని శివసేన తరహాలో టీఆర్ఎస్‌ లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, సమయం చూసుకుని రెబల్ నేతలు తిరుగుబాటు చేస్తారని ఇటీవల రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఏక్ నాథ్ షిండేలు రెడీగా ఉన్నారని అన్నారాయన. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో కూడా ఏక్ నాథ్ షిండే పేరు […]

తెలంగాణ రాజకీయాల్లో ఏక్ నాథ్ షిండేల రగడ..
X

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల్లో ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పేరు తెరపైకి వస్తోంది. మహారాష్ట్రలోని శివసేన తరహాలో టీఆర్ఎస్‌ లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, సమయం చూసుకుని రెబల్ నేతలు తిరుగుబాటు చేస్తారని ఇటీవల రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించిన సంగతి తెలిసిందే.

ఏక్ నాథ్ షిండేలు రెడీగా ఉన్నారని అన్నారాయన. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో కూడా ఏక్ నాథ్ షిండే పేరు చెప్పి తమను విమర్శిస్తున్నారని, అసలు కట్టప్ప స్టోరీ ఏంటో ఆయనకు తెలుసా అంటూ లక్ష్మణ్ ని ఎద్దేవా చేశారు.

ఏక్ నాథ్ షిండే, తోక్ నాథ్ షిండే.. ఎవరూ టీఆర్ఎస్ లో లేరని, ఎవరూ టీఆర్ఎస్ ని ఏమీ చేయలేరని చెప్పారు సీఎం కేసీఆర్. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తెలంగాణలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని చెప్పడం విశేషం.

కేసీఆర్ ధోరణి వల్లే టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండే లు పుట్టుకొస్తున్నారని, అయితే దాన్ని కూడా బీజేపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఏక్ నాథ్ షిండే పేరు మాత్రం హైలైట్‌ అవుతోంది.

ద్రౌపది ముర్ముని ఓడించే సత్తా ఉందా..?

దేశంలో నీతివంతమైన పాలన సాగుతుంది కాబట్టే 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని చెప్పారు బండి సంజయ్. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్థానాలను బీజేపీ గెలుచుకుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చూపించామని అన్నారాయన. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు.

బీజేపీ బహిరంగ సభ చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నాయకులు గోడ మీద ఉన్నారని.. దూకేందుకు సిద్ధం అయ్యారని జోస్యం చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును దమ్ముంటే ఓడించాలని కేసీఆర్ కి సవాల్ విసిరారు బండి సంజయ్. ఓ ఎస్టీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి బీజేపీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, టీఆర్ఎస్ నేతలు కూడా ఆత్మ సాక్షిని గౌరవించి, ద్రౌపది ముర్ముకు ఓటేసి గెలిపించాలని కోరారు.

First Published:  10 July 2022 9:08 PM GMT
Next Story