Telugu Global
Health & Life Style

మొటిమల ఆట కట్టించొచ్చు ఇలా….!!

ముఖం మీద మొటిమలు రావడం అనేది ఈకాలంలో చాలా సాధారణం అయిపోయింది. ఆడా, మగ తేడా లేకుండా పిలవని అథితుల్లాగా వచ్చేస్తుంటాయి. నొప్పిగా ఉండటం, చీము పట్టడంతో ముఖాన్ని ఇబ్బంది పెట్టేస్తాయి. కేవలం ఇలా ఇబ్బంది పెట్టడమే కాకుండా అవి తగ్గిపోయేలోపు ముఖం మీద వాటి తాలుకు గుర్తులు ఉండిపోయేలా చేస్తాయి. కొందరు చీము బయటకుపోతే నొప్పి ఉండదనే ఆలోచనతో వాటిని గిల్లడం, ఒత్తడం చేస్తుంటారు. అలాగే మరికొందరు రకరకాల ప్రయోగాలు చేసి ఏవేవో పూతలు పూసి […]

మొటిమల ఆట కట్టించొచ్చు ఇలా….!!
X

ముఖం మీద మొటిమలు రావడం అనేది ఈకాలంలో చాలా సాధారణం అయిపోయింది. ఆడా, మగ తేడా లేకుండా పిలవని అథితుల్లాగా వచ్చేస్తుంటాయి. నొప్పిగా ఉండటం, చీము పట్టడంతో ముఖాన్ని ఇబ్బంది పెట్టేస్తాయి. కేవలం ఇలా ఇబ్బంది పెట్టడమే కాకుండా అవి తగ్గిపోయేలోపు ముఖం మీద వాటి తాలుకు గుర్తులు ఉండిపోయేలా చేస్తాయి.

కొందరు చీము బయటకుపోతే నొప్పి ఉండదనే ఆలోచనతో వాటిని గిల్లడం, ఒత్తడం చేస్తుంటారు. అలాగే మరికొందరు రకరకాల ప్రయోగాలు చేసి ఏవేవో పూతలు పూసి వాటిని తగ్గించడానికి బదులు ఇంకా పెరిగేలా చేసుకుంటారు. మంచి చర్మసంరక్షణ పద్ధతులు పాటించడం వల్ల మొటిమలను తగ్గించుకుని, ఇకపై రాకుండా చేయడం సాధ్యమేనని చర్మసంరక్షణ నిపుణులు చెపుతున్నారు.

మొటిమలు రావడానికి కారణం!!

మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం. చాలామంది ముఖం కడుక్కోవడానికి కూడా బద్దకం చూపిస్తారు. ముఖం మీద మురికి పేరుకుపోయి అది క్రమంగా మొటిమలు రావడానికి కారణం అవుతుంది అలాగే చర్మసంబంధ ఉత్పత్తులు ఉపయోగించడం., మన చర్మానికి సరిపడే మేకప్ కిట్ ను ఎంచుకోకపోవడం.. వీటిని ఎక్కువగా ముఖంపై ఉపయోగించడం కూడా మొటిమలకు కారణం అవుతాయి. కంటికి ఆకర్షణగా కనిపించడం, మంచి సువాసన, ఉపయోగించడం తేలిక అనే భావనతో అన్నిరకాల ఉత్పత్తులను తీసుకొచ్చి వాడటం వల్ల ముఖచర్మం దెబ్బతింటుంది. అలాగే తినే ఆహారం కూడా మొటిమలు రావడానికి కారణం అవుతుంది. వేడి చేసే పదార్థాలు, రక్తాన్ని కలుషితం చేసేవి, నూనె పదార్థాలు, బేక్ చేసిన పదార్థాలు ఇలా అన్నీ మొటిమలు కారణాలు.

పోషణ ఇవ్వాలి!!

చర్మానికి పోషణ ఎంతబాగుంటే ముఖచర్మం అంత యవ్వనంగా ఉంటుంది. అలాగే ఎలాంటి చర్మ సమస్యలు దరిచేరవు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తేమశాతం సమృద్ధిగా ఉండాలి. నీటిశాతం అధికంగా ఉన్న పండ్లు, చర్మానికి పోషణ ఇచ్చే కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలి. కాలానుగుణంగా మాయిశ్చరైజర్ లు, సీరం లు వాడాలి. అయితే వీటి ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. క్యారెట్లు, బచ్చలికూర, టమాటా, పెరుగు, దోసకాయ, నారింజ, నిమ్మ మొదలైనవి ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

చర్మం చాలా సున్నితంగా ఉంటే మొటిమలు చాలా తోందరగా వస్తాయి. అందుకే చర్మసంబంధ ఉత్పత్తులు కొనేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి.

★ మొటిమలు వచ్చే చర్మం చాలావరకు జిడ్డుచర్మం అయి ఉంటుంది. అలాంటివాళ్ళు ఆయిల్ ఫ్రీ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. ఆయిల్ ఉత్పత్తులను తీసుకుని వాడితే అవి చర్మ రంద్రాలను మూసివేస్తాయి. దానివల్ల మొటిమల సమస్య మరింత పెరుగుతుంది.

★ ముఖ చర్మానికి స్క్రబ్ చేయడం చాలా బాగుంటుంది. ఇది అదనపు జిడ్డును, ముఖం మీది మలినాలను తొలగిస్తుంది. నల్లబడిన చర్మం తిరిగి కాంతివంతంగా మారేలా చేస్తుంది. అయితే మొటిమలు ఉన్నప్పుడు స్క్రబ్ చేయడం తప్పు. ఇది మొటిమలను విచ్చినం చేసి ముఖాన్ని గందరగోళం చేస్తాయి.

★ ముఖాన్ని పదేపదే కడుగుతూ ఉంటే చర్మం పొడిబారుతుంది. కాబట్టి అతి శుభ్రత కూడా సమస్యను తెచ్చిపెడుతుంది. మొటిమలు తగ్గించుకోవడానికి వాడే ఉత్పత్తులలో సాలిసిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ మిశ్రమాలు ఉండేలా చూసుకోవాలి.

★ చర్మరకాన్ని బట్టి మాయిశ్చరైజర్ ఎంపిక చేసుకోవాలి. మొటిమలు వచ్చినప్పుద్ చాలావరకు గందరగోళంలో ఎక్కడెక్కడో ఉన్న చిట్కాలు అన్నీ ప్రయోగిస్తుంటారు. పూర్తిగా తెలియకుండా చర్మం మీద ఏ పూతలు, ఏ ఉత్పత్తులు పూయకూడదు.

★ మేకప్ లేకుంటే బయటకు వెళ్లే అమ్మాయిలు తక్కువే. కనీసం ఫౌండేషన్, లిప్స్టిక్ వంటివి అయినా వాడటం తప్పనిసరి అయిపోయింది. అయితే మొటిమలకు ఇవి కూడా కారణం అవుతాయి. ఇంటికి చేరగానే మేకప్ తొలగించడం మర్చిపోకూడదు. అలాగే ఎక్కువసేపు మేకప్ తో ఉండటం మంచిదికాదు. మేకప్ వల్ల చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది.

★ మొటిమలు వచ్చిన చర్మానికి వేడి, చల్లదనం వంటివి ఎక్కువ తగలకూడదు. మొటిమాల్లో ఉండే చీములో బాక్టీరియా ఉంటుంది నేరుగా చేతులతో, గోళ్ళతో ముట్టుకోకూడదు. మొటిమలు పగిలితే గోరువెచ్చని నీటిలో ముంచి పిండేసిన కాటన్ బాల్ ఉపయోగించాలి. అలాగే మొటిమలు వచ్చాయని అతిగా ఆలోచించడం కూడా తలనొప్పే.

First Published:  11 July 2022 12:36 PM IST
Next Story