అస్సోంలో గ్రామ పంచాయతీ తీర్పుతో వ్యక్తి సజీవ దహనం
ఆధునిక సమాజంలో ఇంకా అనాగరిక, అమానుష పోకడలు తొలిగిపోలేదు. ఏదో మూలలో ఏదో అమానుషం జరుగుతూనే ఉంది. తాజాగా అస్సోం రాష్ట్రంలోని నాగావ్ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ దారుణమైన నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని పంచాయతీ ఒక వ్యక్తిని సజీవ దహనం చేయాలని తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో ఆ వ్యక్తిని సజీవ దహనం చేశారు. సామగుడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోర్లలూంగావ్, బ్రహ్మపూర్ బామునిలో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. బోర్లలూంగావ్ గ్రామానికి […]
ఆధునిక సమాజంలో ఇంకా అనాగరిక, అమానుష పోకడలు తొలిగిపోలేదు. ఏదో మూలలో ఏదో అమానుషం జరుగుతూనే ఉంది. తాజాగా అస్సోం రాష్ట్రంలోని నాగావ్ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ దారుణమైన నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని పంచాయతీ ఒక వ్యక్తిని సజీవ దహనం చేయాలని తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో ఆ వ్యక్తిని సజీవ దహనం చేశారు.
సామగుడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోర్లలూంగావ్, బ్రహ్మపూర్ బామునిలో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. బోర్లలూంగావ్ గ్రామానికి చెందిన రంజిత్ బార్దోలోయ్ ఓ 22 ఏళ్ల మహిళ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొన్నాడు. అతను ఆ మహిళను హత్య చేస్తుండగా చూశామంటూ కొందరు ప్రత్యక్ష సాక్షులు పంచాయతీలో చెప్పారు.
దీంతో పంచాయతీ పెద్దలు రంజిత్ ను కాల్చి చంపాలని తీర్పునిచ్చారు. ముందు రంజిత్ ను ఇంటి నుంచి తన్నుకుంటూ తీసుకెళ్ళి పంచాయతీలో చెట్టుకు కట్టేశారు. అనంతరం పెద్దల తీర్పుతో అతనిని సజీవ దహనం చేసి మృతదేహాన్ని పాతిపెట్టారని పోలీసులు తెలిపారు.
శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన వార్త ఆదివారం పోలీసులకు చేరడంతో వెంటనే వారు గ్రామానికి చేరుకుని గ్రామపెద్దలు పూడ్చిపెట్టిన రంజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
అతడి శరీరంపై 90 శాతం కాలిన గాయాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రంజిత్ బోర్డోలోయ్‌కు నిప్పంటించినందుకు ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ లీనా డోల్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.