ఏపీలో ఆ పథకం మళ్లీ మొదలైంది..
విదేశాల్లో చదువుకోడానికి వెళ్లే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకోసం గతంలో టీడీపీ ప్రభుత్వం ఏపీ విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చింది. వైసీపీ హయాంలో దాన్ని నిలిపివేశారు. అక్రమాలు జరిగాయని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదనే కారణంగా పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టారు. అయితే దీన్ని ఇప్పుడు తిరిగి పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో దీన్ని తిరిగి అమలులోకి తెస్తున్నారు. కులమతాలు కాదు ప్రతిభే గీటురాయి.. జగనన్న విదేశీ […]
విదేశాల్లో చదువుకోడానికి వెళ్లే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకోసం గతంలో టీడీపీ ప్రభుత్వం ఏపీ విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చింది. వైసీపీ హయాంలో దాన్ని నిలిపివేశారు. అక్రమాలు జరిగాయని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదనే కారణంగా పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టారు. అయితే దీన్ని ఇప్పుడు తిరిగి పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో దీన్ని తిరిగి అమలులోకి తెస్తున్నారు.
కులమతాలు కాదు ప్రతిభే గీటురాయి..
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో కేవలం ప్రతిభనే చూస్తామంటోంది ప్రభుత్వం. అగ్రకులాల్లో కూడా ఆర్థికంగా వెనుకబడినవారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని టాప్-200 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థుల చదువు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. టాప్-100 యూనివర్సిటీల్లో సీటు వస్తే మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తుంది.
నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము జమచేస్తారు. ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లిస్తారు. ఫస్ట్ సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా, రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా, నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే చివరి వాయిదా చెల్లిస్తారు.
గతంలో లబ్ధిదారుల కుటుంబ ఆదాయ పరిమితి ఏడాదికి 6 లక్షలు ఉండగా, ఇప్పుడు దాన్ని 8 లక్షల రూపాయలకు పెంచారు. గతంలో కొన్ని దేశాలకు మాత్రమే అనుమతి ఉండేది. ఇప్పుడు టాప్ -200 యూనివర్సిటీల్లో ఎక్కడైనా చదువుకునే అవకాశముంది. గతంలో అగ్రవర్ణాలకు ఈ పథకం వర్తించదు, ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు కూడా వర్తిస్తుంది.
వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ధారించారు. ఏపీలో స్థానికులై ఉండాలి, కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏడాది సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య కాలంలో అర్హులను గుర్తిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది.
గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన సమయంలో లోటుపాట్లు ఉన్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితులు పాటించలేదని నిర్ధారించారు. ఆర్థిక సాయం పొందిన విద్యార్థులు తాము చదువుతున్న యూనివర్సిటీని, వెళ్లాల్సిన దేశాన్ని కూడా ముందస్తు సమాచారం లేకుండా మార్చుకున్నారు.
ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని కోర్సు పూర్తి చేయకుండానే కొంతమంది వెనక్కి వచ్చేశారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి కూడా ఈ స్కీమ్ వర్తింపజేశారు. చివరిగా బకాయిలు పెట్టి మరీ టీడీపీ దిగిపోయింది. 2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలుగా పెట్టింది గత ప్రభుత్వం. ఈ లోటుపాట్లని సరిదిద్దుకుంటూ ఇప్పుడు మళ్లీ ఈ పథకాన్ని తెరపైకి తెస్తోంది వైసీపీ ప్రభుత్వం.