Telugu Global
National

ఆఫ్టర్ మహారాష్ట్ర.. ఆపరేషన్ గోవా..

మహారాష్ట్రలో అధికారం కోసం శివసేనను రెండు ముక్కలు చేసిన బీజేపీ, ఇప్పుడు గోవాపై దృష్టి సారించింది. విచిత్రం ఏంటంటే.. గోవాలో బీజేపీదే అధికారం, అయినా కూడా ఆ పార్టీ అక్కడ కాంగ్రెస్ ని మింగేయాలని చూస్తోంది. 11మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ నుంచి ఏడుగురిని లాగేసుకోవాలని ప్లాన్ వేసింది బీజేపీ. దాదాపుగా ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే దశలో ఉంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో వారంతా కాంగ్రెస్ ని […]

ఆఫ్టర్ మహారాష్ట్ర.. ఆపరేషన్ గోవా..
X

మహారాష్ట్రలో అధికారం కోసం శివసేనను రెండు ముక్కలు చేసిన బీజేపీ, ఇప్పుడు గోవాపై దృష్టి సారించింది. విచిత్రం ఏంటంటే.. గోవాలో బీజేపీదే అధికారం, అయినా కూడా ఆ పార్టీ అక్కడ కాంగ్రెస్ ని మింగేయాలని చూస్తోంది. 11మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ నుంచి ఏడుగురిని లాగేసుకోవాలని ప్లాన్ వేసింది బీజేపీ. దాదాపుగా ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే దశలో ఉంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో వారంతా కాంగ్రెస్ ని వీడి, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ కి వరుస ఎదురు దెబ్బలు..

దేశంలో బీజేపీ పాలన బాగోలేదనేది అందరూ ముక్తకంఠంతో చెబుతున్న విషయం. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకోకపోవడంతో బీజేపీకి తిరుగులేకుండా పోతోంది. పోనీ విపక్షాల్లో ఐక్యత ఉందా అంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో అది ఏ స్థాయిలో ఉందో బట్టబయలు అయిపోయింది. దీంతో బీజేపీ మరింత దూకుడుగా వెళ్తోంది. కాంగ్రెస్ పై నేతలకు భరోసా లేకపోవడంతో పక్కచూపులు చూస్తున్నారు. వరసగా ఎదురువుతున్న పరాభవాలు పార్టీ కార్యకర్తలను, నేతలను నిరాశలోకి నెట్టేస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణే గోవా పాలిటిక్స్.

40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. గోమంతక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి గోవాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరిలో అసంతృప్తి మొదలైంది. ప్రతిపక్షంలో ఉండి సాధించేదేమీ లేదని, అధికార పార్టీలోకి జంప్ అవ్వాలనుకుంటున్నారు. బడ్జెట్ సెషన్ ముందు జరిగిన పార్టీ మీటింగ్ కి ఏడుగురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవని, తమ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారని గోవా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దినేష్ గుండూ రావు చెప్పారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అవన్నీ వట్టి పుకార్లేనని గోవా పీసీసీ చీఫ్ చీఫ్ అమిత్ పాట్కర్ అన్నారు.

కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం మరోలా ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ ఎన్నికను సైతం అర్థాంతరంగా రద్దు చేశారు గోవా స్పీకర్ రమేష్ తవాడ్కర్. కొత్తగా ఎన్నిక జరిగే నాటికి గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడుగురు బీజేపీవైపు వచ్చేస్తారని అంటున్నారు.

First Published:  11 July 2022 1:48 AM IST
Next Story