9 లక్షల మంది జనం.. ఈ ప్లీనరీ ఓ సువర్ణ అధ్యాయం..
వైసీపీ ప్లీనరీ సమావేశాలు పార్టీ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతాయని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్లీనరీ వైభవంగా జరిగిందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారాయన. రెండురోజులపాటు జరిగిన ఈ ప్లీనరీకి 9 లక్షలమంది కార్యకర్తలు వచ్చారన్నారు. ప్లీనరీ ప్రాంగణం అంతా రెండురోజులపాటు జన సముద్రంగా మారిందని చెప్పారు. సకల జనుల సాధికారత, సామాజిక ఆర్ధిక రాజకీయ మహిళా సాధికారత, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వైసీపీ ప్లీనరీ జరిగిందని అన్నారు. ప్లీనరీ ప్రాంగణం నుంచి దాదాపు […]
వైసీపీ ప్లీనరీ సమావేశాలు పార్టీ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతాయని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్లీనరీ వైభవంగా జరిగిందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారాయన.
రెండురోజులపాటు జరిగిన ఈ ప్లీనరీకి 9 లక్షలమంది కార్యకర్తలు వచ్చారన్నారు. ప్లీనరీ ప్రాంగణం అంతా రెండురోజులపాటు జన సముద్రంగా మారిందని చెప్పారు. సకల జనుల సాధికారత, సామాజిక ఆర్ధిక రాజకీయ మహిళా సాధికారత, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వైసీపీ ప్లీనరీ జరిగిందని అన్నారు.
ప్లీనరీ ప్రాంగణం నుంచి దాదాపు 20కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయిందంటే ప్లీనరీ ఏ స్థాయిలో విజయవంతం అయిందో అర్థం చేసుకోవచ్చన్నారు విజయసాయిరెడ్డి.
ప్రపంచమంతా వైసీపీని పొగుడుతుంటే చంద్రబాబు విమర్శలు చేయడం ఆయన భావ దారిద్ర్యానికి నిదర్శనం అని చెప్పారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు దగ్గర చిప్ ఉందని ఆయనే చెప్పారని, ఆ చిప్ మెదడులోకి ఆ తర్వాత భూమిలోకి పోతుందని సెటైర్లు వేశారు.
వైసీపీ ప్లీనరీ చూసి చంద్రబాబు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడని అన్నారు. తిట్టడం తమ అజెండా కాదని, రాబోయే రెండేళ్లలో ఏమేం చేయాలనుకున్నామన్నదే సమావేశాల్లో బహిరంగ పరిచామని చెప్పారు విజయసాయిరెడ్డి.
వాలంటీర్ కుటుంబానికి 5 లక్షల పరిహారం..
వైసీపీ ప్లీనరీ విజయవంతం కోసం పార్టీ తరపున వాలంటీర్లు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని చెప్పారు విజయసాయిరెడ్డి. ప్లీనరీ నుంచి వెళ్తూ ప్రమాదంలో మరణించిన వాలంటీర్ దినేష్ కుటుంబానికి 5లక్షల రూపాయల పరిహారాన్ని పార్టీ తరఫున అందిస్తున్నట్టు ప్రకటించారాయన.