పిక్నిక్ స్పాట్‌లా మారిన అధ్యక్ష భవనం.. రూ. 1 కోటి నగదు గుర్తింపు
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాలు, చమురు, మెడిసిన్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేషన్ ప్రకారం పోస్తున్నారు. ఏప్రిల్ నుంచి దేశంలో అధ్యక్షుడు గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజపక్స కుటుంబం కారణంగానే దేశం ఇంత అప్పుల్లో కూరుకొని పోయిందని శ్రీలంక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే గొటబయ సోదరుడు మహింద రాజపక్స ఎప్పుడో ప్రధాని పదవికి రాజీనామా చేశాడు. ఆయన స్థానంలో విక్రమ […]
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాలు, చమురు, మెడిసిన్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేషన్ ప్రకారం పోస్తున్నారు.
ఏప్రిల్ నుంచి దేశంలో అధ్యక్షుడు గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజపక్స కుటుంబం కారణంగానే దేశం ఇంత అప్పుల్లో కూరుకొని పోయిందని శ్రీలంక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే గొటబయ సోదరుడు మహింద రాజపక్స ఎప్పుడో ప్రధాని పదవికి రాజీనామా చేశాడు. ఆయన స్థానంలో విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయినా సరే పౌరుల ఆగ్రహం చల్లారలేదు.
గొటబయ రాజపక్స రాజీనామా చేయాల్సిందేనని అధ్యక్ష భవనం ఎదుట గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది. మూడంచెల భద్రతను దాటుకొని వేలాది మంది ప్రజలు శ్రీలంక అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు. కాగా, గొటబయ తన ఫ్యామిలీతో సహా అప్పటికే ప్రెసిడెంట్ బిల్డింగ్ నుంచి పారిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారో ప్రస్తుతం ఎవరికీ తెలియడం లేదు. దేశం వదిలి పారిపోయి ఉంటారని శ్రీలంక పోలీసులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్, సీపోర్ట్ ద్వారా భారీ లగేజి తరలిస్తున్న వీడియోలు శ్రీలంక సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
భవనంలో భారీగా నగదు..
శ్రీలంకను బ్రిటిషర్లు పరిపాలించే కాలంలో నిర్మించిన భారీ భవంతినే ప్రస్తుతం అధ్యక్ష భవనంగా ఉపయోగిస్తున్నారు. 200 ఏళ్లుగా కేవలం బ్రిటిషర్లు, శ్రీలంక అధ్యక్షులకే పరిమితం అయిన ఆ భారీ భవనంలో ఇప్పుడు సామాన్యుడు ప్రవేశించాడు. వేలాదిగా వచ్చిన ప్రజలు తమకు నచ్చిన రూమ్‌లో దూరిపోయి అక్కడే తిష్ట వేశారు. కొంత మంది స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతుండగా.. మరి కొంత మంది అక్కడి కిచెన్లో రకరకాల వంటలు చేసుకొని తింటున్నారు. ప్రతీ గదిలో తిరుగుతూ అక్కడే పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తున్నారు.
కొంత మంది ఆ భవనాన్ని క్షణ్ణంగా పరిశీలించగా దాదాపు రూ. 1 కోటి విలువైన కరెన్సీని గుర్తించారు. ఆ డబ్బును మెషిన్ల ద్వారా లెక్కిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. డబ్బును లెక్కపెట్టి కట్టలు కడుతున్నారు. వాటిని సొంతగా వాడుకోమని, పోలీసులకు స్వాధీనం చేస్తామని చెప్తున్నారు. పోలీసులు కూడా అధ్యక్ష భవనంలో ఉన్న ప్రజలను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం ఏమీ చేయడం లేదు.
శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేస్తే ప్రధాని ఆ బాధ్యతలు తీసుకోవాలి. అయితే ప్రధాని విక్రమ సింఘే కూడా ఆ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. దీంతో స్పీకర్ ఎన్నికలు ముగిసే వరకు అధ్యక్ష బాధ్యతలు చూస్తారు. నెల రోజుల్లో శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.