Telugu Global
NEWS

వింబుల్డన్ గెలిచి చరిత్ర సృష్టించిన రిబకినా

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రిబకినా గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఓ గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి కజకిస్తాన్ ప్లేయర్‌గా నిలవడమే కాకుండా, 2011 తర్వాత ఈ టైటిల్ గెలిచిన అతి పిన్న వయసు క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. శనివారం సెంటర్ కోర్టులో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 17వ సీడ్ రిబకినా 3-6, 6-2, 6-2 తేడాతో ట్యునీషియాకు చెందిన మూడో సీడ్ ఆన్స్ జబేర్‌పై విజయం సాధించింది. తొలి సెట్‌ను కోల్పోయినా.. ఏ మాత్రం ఏకాగ్రత […]

వింబుల్డన్ గెలిచి చరిత్ర సృష్టించిన రిబకినా
X

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రిబకినా గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఓ గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి కజకిస్తాన్ ప్లేయర్‌గా నిలవడమే కాకుండా, 2011 తర్వాత ఈ టైటిల్ గెలిచిన అతి పిన్న వయసు క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. శనివారం సెంటర్ కోర్టులో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 17వ సీడ్ రిబకినా 3-6, 6-2, 6-2 తేడాతో ట్యునీషియాకు చెందిన మూడో సీడ్ ఆన్స్ జబేర్‌పై విజయం సాధించింది. తొలి సెట్‌ను కోల్పోయినా.. ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా పుంజుకున్నది. మిగిలిన రెండు సెట్లలో ప్రత్యర్థి జబేర్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ఏకంగా 29 విన్నర్స్, 4 ఏస్‌లు సంధించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ఏ మాత్రం అంచనాలు లేకుండా వింబుల్డన్ బరిలో దిగి రిబకినాకు సెమీస్‌లో హాలెప్ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురైంది. కానీ, హాలెప్‌ను ధైర్యంగా ఎదుర్కొని ఫైనల్ చేరింది. అయితే తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న జబేర్‌ తొలి సెట్‌లో దూకుడుగా ఆడింది. రెండు సార్లు రిబకినా సర్వీసును బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెలుచుకున్నది. అదే ఊపులో రెండో సెట్ కూడా గెలవాలని కలలు కన్న జబేర్ ఆశలను రిబకినా కల్లలు చేసింది. తన దూకుడైన ఆటను జబేర్‌కు చూపించింది. విన్నర్లతో విరుచుకపడి.. జబేర్‌పై ఆధిపత్యం ప్రదర్శించి రెండు సర్వీసులు బ్రేక్ చేసింది. దీంతో రెండో సెట్ రిబకినా వశం అయ్యింది.

మ్యాచ్ డిసైడింగ్ మూడో సెట్‌లో కూడా జబేర్‌ను కోలుకోనివ్వలేదు. పలుమార్లు జబేర్ దూకుడుగా ఆడటానికి ప్రయత్నించినా.. తన టెక్నిక్‌తో రిబకినా పైచేయి సాధించింది. ఫుల్ జోష్‌తో ఆడిన రిబకినా చివరకు మూడో సెట్‌ను కూడా 6-2తో గెలుచుకున్నది. దీంతో ఫైనల్ మ్యాచ్ చివరి రెండు సెట్లను దీటుగా ఆడిన రిబకినా వింబుల్డన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. మ్యాచ్ అనంతరం రిబకినా మాట్లాడుతూ..

జబేర్ నాకు ఒక స్పూర్తి అని చెప్పింది. తనతో ఆడటాన్ని చాలా ఆస్వాదించానని.. ఈ నమ్మశక్యం కాని వాతావరణంలో ఆడటం ఓ గౌరవమని అన్నారు. కనీసం మూడో రౌండ్‌కు అయినా చేరుకుంటాననే నమ్మకం లేదని, కానీ ఏకంగా విజేతగా నిలవడంతో మాటలు రావడం లేదని రిబకీనా అన్నది. ఇదంతా నా టీమ్ వల్లే సాధ్యమైంది. అలాగే నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అని చెప్పింది.

First Published:  10 July 2022 4:56 AM IST
Next Story