ఆన్ లైన్ లో ఫిట్ నెస్ పాఠాలు.. కరోనా చూపిన ఉపాధి మార్గాలు..
కరోనా కాలంలో శారీరక వ్యాయామం ఎంత అవసరమో చాలామందికి తెలిసొచ్చింది. సంపాదనపై దృష్టిపెట్టి శారీరక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం తప్పని అర్థమైంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఫిట్ నెస్ పై శ్రద్ధ పెరిగింది. కరోనా తర్వాత జిమ్ లకు డిమాండ్ పెరిగింది. అయితే కరోనా కొత్త ఉపాధి మార్గాన్ని కూడా చూపించింది. అదే ఆన్ లైన్ ఫిట్ నెస్ ట్రైనింగ్. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిట్ నెస్ పాఠాలు బోధించే ట్రైనర్లకు బోలెడన్ని ఉపాధి […]
కరోనా కాలంలో శారీరక వ్యాయామం ఎంత అవసరమో చాలామందికి తెలిసొచ్చింది. సంపాదనపై దృష్టిపెట్టి శారీరక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం తప్పని అర్థమైంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఫిట్ నెస్ పై శ్రద్ధ పెరిగింది. కరోనా తర్వాత జిమ్ లకు డిమాండ్ పెరిగింది.
అయితే కరోనా కొత్త ఉపాధి మార్గాన్ని కూడా చూపించింది. అదే ఆన్ లైన్ ఫిట్ నెస్ ట్రైనింగ్. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిట్ నెస్ పాఠాలు బోధించే ట్రైనర్లకు బోలెడన్ని ఉపాధి మార్గాలున్నాయి. అలాంటివారందర్నీ ఓచోట చేర్చి, తమ క్లైంట్ లకు పాఠాలు చెప్పిస్తున్న ఫిట్టర్ అనే సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 100కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాది దాన్ని రెట్టింపు చేయాలనే ఆలోచనల్లో ఉంది.
ఆన్ లైన్ లో ఫిట్ నెస్ పాఠాలు నేర్పుతాం, ప్రతి ఒక్కరికీ ఒక్కో వ్యక్తిగత కోచ్ ని ఏర్పాటు చేస్తాం, మీకు కావాల్సిన వ్యాయామ పరికరాలన్నీ మేమే అందిస్తామంటూ ముందుకొచ్చిన ఫిట్టర్ సంస్థ గత ఏడాదిగా ఆన్ లైన్ లో దుమ్ము దులిపేస్తోంది. కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు, వివిధ కంపెనీల సీఈవోలు, గృహిణులు, విద్యార్థులు ఈ సంస్థకు క్లైంట్ లు గా ఉన్నారు.
ఈ సంస్థకోసం ప్రస్తుతం 1200మంది కోచ్ లు పనిచేస్తున్నారు. వీరంతా ఫ్రీలాన్స్ గా ఈ సంస్థలో వర్క్ చేస్తుంటారు. కొత్తగా వెయ్యిమంది కోచ్ ల అవసరం ఉందని సదరు సంస్థ ప్రకటించింది. కేవలం క్లైంట్ లకు, కోచ్ లకు మధ్య సంధాన కర్తగా ఉండటం వల్లే వంద కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది ఈ సంస్థ.
ఫిట్ నెస్ యాప్ లకు పెరిగిన క్రేజ్..
ఆన్ లైన్లో ఫ్రీగా లభించే ఫిట్ నెస్ యాప్ లు ఉన్నాయి. కానీ ఈ ఫ్రీ యాప్ లతోపాటు డబ్బులు వసూలు చేసి ప్రతి రోజూ ఫిట్ నెస్ పాఠాలు చెబుతూ, పర్సనల్ గ్రోత్ ని కూడా లెక్కించి, మోటివేట్ చేసే యాప్ లు కూడా ఉన్నాయి. కరోనా తర్వాత ఇలాంటి యాప్ లకు క్రేజ్ మరింత పెరిగింది. కరోనా వచ్చిన తర్వాత కొత్తగా 71వేల ఫిట్ నెస్ యాప్ లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఫిట్ నెస్ పై ఎంత శ్రద్ధ పెరిగిందో ఊహించవచ్చు.
అందుకే ఇప్పుడీ మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయల్లా సాగుతోంది. నేరుగా జిమ్ కి వెళ్లి చెమటోడ్చేవాళ్లతోపాటు, ఆన్ లైన్ గురువుల దగ్గర పాఠాలు నేర్చుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.