Telugu Global
NEWS

రేవంత్‌తో విభేదాలు లేవు.. కలిసే ఉన్నాం: ఎంపీ కోమటిరెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ పర్యటనను వ్యతిరేకించడం, రేవంత్‌కు సమాచారం ఇవ్వకుండానే తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన రవి అనే వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోవడంతో ఈ విభేదాలు నిజమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎర్ర శేఖర్‌ను చేర్చుకోవడంపై కోమటిరెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీనియర్ నాయకుల […]

Komatireddy Venkat Reddy
X

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ పర్యటనను వ్యతిరేకించడం, రేవంత్‌కు సమాచారం ఇవ్వకుండానే తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన రవి అనే వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోవడంతో ఈ విభేదాలు నిజమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎర్ర శేఖర్‌ను చేర్చుకోవడంపై కోమటిరెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీనియర్ నాయకుల మధ్య సఖ్యత లేదని కార్యకర్తలుకూడా భావించారు.

ఇటీవల పార్టీ కార్యక్రమాలకు కూడా కోమటిరెడ్డి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై తాజాగా కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన ఇంటిలో ఏర్పాటు చేసిన లంచ్‌కు పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ సహా పలువురు టీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చురుగ్గానే ఉన్నానని స్పష్టం చేశారు.

పార్టీని వీడి పోవట్లేదని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని, ఆయనతో కలసి పని చేస్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ క్షణంలో అయినా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.

సిరిసిల్లలో రాహుల్ గాంధీ సభ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించామని వెంకటరెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా 70 నుంచి 80 సీట్లు తప్పకుండా వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అభ్యర్థులను ఎంపిక చేయాలని కోమటరెడ్డి సూచించారు. ఈ సారి అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం జరిగేలా టికెట్లు పంపిణీ చేయాలని కోరారు.

సిరిసిల్లలో సభ ఎక్కడ నిర్వహించాలనే విషయంపై చర్చ జరిగిందన్నారు. ఆ సభ తర్వాత కాంగ్రెస్‌లో మరింత ఉత్సాహం వస్తుందని చెప్పారు. తాను కొంచెం బిజీగా ఉండటం వల్లే పీఏసీ సమావేశానికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత తాను తెలంగాణ మొత్తం పర్యటించాలని భావిస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

First Published:  10 July 2022 12:34 PM IST
Next Story